కారు డిక్కీలో కరెన్సీ కట్టలు.. 

24 Feb, 2021 02:56 IST|Sakshi
పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన కరెన్సీ కట్టలు

సాక్షి, చేవెళ్ల: ఎన్నికల కోడ్‌ అమలులో భాగంగా వాహనాల తనిఖీలు చేస్తున్న అధికారులు ఓ కారు డిక్కీలో తరలిస్తున్న రూ. 60 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. చేవెళ్ల మండల కేంద్రంలోని షాబాద్‌ చౌరస్తాలో మంగళవారం పోలీసులు, రెవెన్యూ అధికారులు వాహనాల తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో ఓ కారు డిక్కీలో రూ. 60 లక్షలు తీసుకెళుతున్నట్లు గుర్తించారు.

నగదు గురించి ఆరా తీయగా.. ఓ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారికి చెందినవిగా తెలిసింది. దీంతో పట్టుబడిన నగదును రెవెన్యూ కార్యాలయానికి తరలించారు. అనంతరం నగదును సీజ్‌ చేసి వివరాలు అందించాలని సంబంధిత వ్యక్తులకు సూచించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు