అక్రమంగా తరలిస్తున్న సిగరెట్ల పట్టివేత 

1 Aug, 2022 04:50 IST|Sakshi

శంషాబాద్‌: అక్రమంగా నిషేధిత సిగరెట్లను తరలిస్తున్న నిందితులను శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో కస్టమ్స్‌ అధికారులు పట్టుకున్నారు. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో కస్టమ్స్‌ అధికారుల తనిఖీల్లో రూ. 2.98 లక్షల విలువ చేసే నిషేధిత సిగరెట్లు స్వాధీనం చేసుకున్నారు.

బెహరాన్‌ నుంచి జీఎఫ్‌274 విమానంలో హైదరాబాద్‌ వచ్చిన ప్రయాణికుడి వద్ద 29,800 నిషేధిత సిగరేట్లు లభ్యమయ్యాయి. కస్టమ్స్‌ అధికారులు నిందితుని విచారణ చేస్తున్నారు.  

మరిన్ని వార్తలు