జ్యూస్‌ యంత్రంలో బంగారం

14 Nov, 2021 05:00 IST|Sakshi

ఎయిర్‌పోర్టులో పట్టివేత.. 

శంషాబాద్‌: జ్యూస్‌ యంత్రంలో అక్రమంగా తీసుకొచ్చిన బంగారాన్ని కస్టమ్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్‌ నుంచి ఎయిర్‌ ఇండియాకు చెందిన ఏఐ–952 విమానంలో శనివారం రాత్రి ఓ ప్రయాణికుడు శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు వచ్చాడు. అతని కదలికలకపై అనుమానం కలిగిన కస్టమ్స్‌ అధికారులు ప్రయాణికుడి లగేజీని క్షుణ్ణంగా తనిఖీ చేశారు.

చేతితో జ్యూస్‌ తయారు చేసే ఓ యంత్రాన్ని కనుగొని, దాన్ని కట్‌ చేయగా 671 గ్రాముల బంగారం బయటపడింది. బంగారం విలువ 34.18 లక్షలు ఉంటుందని అధికారులు నిర్ధారించారు. ఈ మేరకు నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు.  

మరిన్ని వార్తలు