అలా జరిగింది.. రూపాయితో 20 వేలు!

9 May, 2022 08:10 IST|Sakshi

సాక్షి,బంజారాహిల్స్‌(హైదరాబాద్‌): కేక్‌ ఆర్డర్‌ పేరుతో ఓ మహిళా వ్యాపారవేత్తకు గుర్తుతెలియని వ్యక్తి రూ. 20 వేలు టోకరా వేసిన ఘటన బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. బంజారాహిల్స్‌ రోడ్‌ నెం. 3లోని విష్ణు మిడోస్‌లో ఉంటున్న పూజారెడ్డి కాన్‌సీయూ స్టోర్‌ నిర్వహిస్తోంది. ఈ నెల 2న ఉదయం ఆమెకు ఆర్మీ అధికారి పేరుతో ఓ వ్యక్తి ఫోన్‌ చేసి కేక్‌ ఆర్డర్‌ చేశాడు.

ఇందుకు ఆమె అడ్వాన్స్‌ పేమెంట్‌ చేయాలని చెప్పడంతో ఒక రూపాయి క్యూఆర్‌ స్కాన్‌తో గూగుల్‌పే చేశాడు. దీనిని నమ్మిన ఆమె క్యూ ఆర్‌ కోడ్‌ను స్కాన్‌  చేయగా వెంట వెంటనే మూడు దఫాలుగా రూ. 20 వేలు ఆమె ఖాతా నుంచి అపరిచితుడి ఖాతాలోకి బదిలీ అయ్యాయి. దీనిపై ఆమె బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బంజారాహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

చదవండి: వీసాలున్నా వెళ్లలేక..

మరిన్ని వార్తలు