టాటాస్కై కస్టమర్‌ కేర్‌ నుంచి అంటూ వల.. ఓటీపీ చెప్పడంతో..

6 Aug, 2021 08:23 IST|Sakshi

అకౌంట్‌ నుంచి రూ.1.40 లక్షలు స్వాహా  

సాక్షి, హిమాయత్‌నగర్‌( హైదరాబాద్‌):  టాటాస్కై సెటప్‌ బాక్స్‌లో చిన్నలోపం ఉండటంతో ఎస్సార్‌నగర్‌కు చెందిన కంచన్‌ ముఖర్జీ కస్టమర్‌ కేర్‌కు కాల్‌ చేసి మాట్లాడింది. మరుసటి రోజు ఆమెకు ఓ ఫోన్‌ కాల్‌ వచ్చింది. తాము టాటాస్కై నుంచి మాట్లాడుతున్నామని చెప్పారు. తన సెటప్‌ బాక్స్‌లో ఉన్న సమస్యలన్నీ చెప్పాక రీస్టార్ట్‌ చేసే ముందు తన మొబైల్‌ నంబర్‌కు వచ్చిన ఓటీపీని చెప్పమని అడిగారు.

క్షణం ఆలస్యం లేకుండా ఓటీపీ చెప్పడంతో.. కంచన్‌ ముఖర్జీ బ్యాంక్‌ అకౌంట్‌లో నుంచి రూ. లక్షా 40 వేలు కాజేశారు సైబర్‌ నేరగాడు. దీనిపై బాధితురాలు గురువారం సిటీ సైబర్‌ క్రైం ఏసీపీ కేవీఎన్‌ ప్రసాద్‌కు ఫిర్యాదు చేసింది. ఓ వైపు రోజురోజుకు సైబర్‌ నేరాలు పెరుగుతుండడంతో పోలీసులు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. అపరిచిత కాల్స్‌, ఈజీ మనీ, గిఫ్ట్‌ల పేరిట ఎక్కువగా సైబర్‌ నేరాలు జరుగుతున్నాయని పోలీసులు వెల్లడించారు.

మరిన్ని వార్తలు