ఆన్‌లైన్‌లో కరెంటు బిల్లు కట్టాలని.. 

11 Jul, 2022 03:39 IST|Sakshi

బెంగళూరులో ఓ మహిళకు ‘సైబర్‌’ టోపీ 

ఖాతా నుంచి రూ.10.76 లక్షలు మాయం  

బనశంకరి (బెంగళూరు): ఆన్‌లైన్లో కరెంటు బిల్లు చెల్లించాలని సైబర్‌ నేరగాళ్లు ఓ మహిళ అకౌంట్‌ నుంచి రూ.10.76 లక్షలు కాజేశారు. వివరాల్లోకి వెళితే.. ఈ నెల 7వ తేదీన బెంగళూరులోని కుమారస్వామి లేఔట్‌ నివాసి డాక్టర్‌ వాణి ప్రభాకర్‌  మొబైల్‌ ఫోన్‌కు కరెంటు బిల్లు చెల్లించాలని, లేదంటే కనెక్షన్‌ కట్‌ అవుతుందని గుర్తుతెలియని వ్యక్తి నుంచి  మెసేజ్‌ వచ్చింది.

మెసేజ్‌ వచ్చిన నంబర్‌కు ఆమె ఫోన్‌ చేసి విచారించగా.. టీం వ్యూయర్‌ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవాలని చెప్పగా, ఆమె ఇన్‌స్టాల్‌ చేసింది. మోసగాళ్లు సూచించిన ఖాతాకు రూ.100 చెల్లించింది. కొద్దిసేపటి తరువాత ఆమె బ్యాంకు ఖాతా నుంచి రూ.10.76 లక్షల నగదు వేరే అకౌంట్‌కు జమ అయినట్లు మెసేజ్‌ వచ్చింది. వెంటనే బ్యాంకుకు వెళ్లి విచారించగా డబ్బుపోవడం నిజమేనని తేలింది. దీంతో బాధితురాలు సైబర్‌క్రైం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా విచారణ చేపట్టారు.

మరిన్ని వార్తలు