సన్‌ పరివార్‌ కేసు: విచారణ ముమ్మరం

17 Aug, 2021 15:06 IST|Sakshi

ఇప్పటివరకు రూ.50 కోట్ల వరకు సీజ్ చేసిన పోలీసులు

కొంత మంది రాజకీయ నేతల ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు

సాక్షి, హైదరాబాద్‌: సన్‌పరివార్‌ కేసు విచారణను సైబరాబాద్ పోలీసులు ముమ్మరం చేశారు. ఈడీకి పోలీసులు లేఖ రాశారు. 2018లో వెలుగులోకి వచ్చిన రూ.150 కోట్ల సన్‌పరివార్‌ కేసులో ఆ సంస్థ సీఈవో రవీందర్‌ను అరెస్ట్‌ చేశారు. ఇప్పటికే పటేల్‌గూడ సర్పంచ్ నితీషా సహా ఆరుగురు అరెస్టయ్యారు. 14వేల మంది డిపాజిటర్ల నుంచి రూ.150 కోట్లు వసూలు చేశారు. ఇప్పటివరకు రూ.50 కోట్ల వరకు పోలీసులు సీజ్ చేశారు.

వివిధ బ్యాంకు ఖాతాలు, ఆస్తుల రూపంలో రూ.16కోట్లు గుర్తించారు. అమీన్ పూర్ సోదాల్లో కీలక డాక్యుమెంట్లు, నగదు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అమీన్‌పూర్‌ ఎంపీపీ దేవనాథ్‌ సహా మరో ఇద్దరు పరారీలో ఉన్నారు.  కొంత మంది రాజకీయ నేతల ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

మరిన్ని వార్తలు