సైబర్‌ దొంగ భలే స్మార్ట్‌ గురూ!

23 Jul, 2022 08:39 IST|Sakshi

బనశంకరి: ఐటీ సీటీలో సైబర్‌ కేటుగాళ్లు వంచనకు కొత్తదారులు వెతుకుతున్నారు. ఇప్పటి వరకు బ్యాంకు ఉద్యోగులుగా పరిచయం చేసుకొని ఫోన్లు చేసి కేవైసీ, ఆధార్‌ అనుసంధానం పేరుతో ఓటీపీలు తెలుసుకొని నగదు కొల్లగొట్టేవారు. ప్రస్తుతం కొత్త పంథా అనుసరిస్తున్నారు. స్మార్ట్‌ ఫోన్‌లో థర్డ్‌ పార్టీ యాప్‌ ఇన్‌స్టాల్‌ చేయించి ఓటీపీ యాక్సెస్‌ లేకుండా సులభంగా మీ మొబైల్‌లో ఉన్న పూర్తిసమాచారం తెలుసుకుని అకౌంట్‌ నుంచి నగదు కొల్లగొడుతున్నారు. ఇలా సైబర్‌ వంచకుల బారినపడి లక్షలు పోగొట్టుకున్న బాధితులు సైబర్‌ క్రైం పోలీస్‌స్టేషన్లను ఆశ్రయిస్తున్నారు.

ఫోన్‌పే, గూగుల్‌పేలో సాంకేతిక సమస్యలు తలెత్తితే వాటిని సరిదిద్దే ముసుగులో వంచకులు మోబైల్‌ వినియోగదారులకు ఫోన్‌ చేస్తారు. ప్లేస్టోర్‌లో అందుబాటులో ఉండే థర్డ్‌పార్టీ యాప్‌లైన ఎనీడెస్క్‌ టీమ్‌వ్యూవర్‌హాస్క్, క్విక్‌సపోర్ట్, రిమోట్‌డ్రైడ్, ఏర్‌మిరర్, రిమోట్‌ కంట్రోలర్‌ లేదా స్క్రీన్‌షేర్‌ యాప్‌లను డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సూచిస్తారు. దీంతో వినియోగదారులు యాప్‌లను డౌన్‌లోడ్‌ చేసుకున్న తక్షణం ఆ సెల్‌ఫోన్‌ ద్వారా జరిగే కార్యకలాపాలన్నీ వంచకుల చేతిల్లోకి వెళ్లిపోతాయి. దీంతో సులభంగా నెట్‌బ్యాంకింగ్‌ సమాచారం, పాస్‌వర్డ్స్, ప్రముఖ డేటా, వ్యక్తిగత సమాచారం, ఫొటోలు సేకరిస్తారు. బ్యాంకులో నగదు బదిలీకి ప్రయత్నిస్తారు. బ్యాంకు నుంచి వచ్చే ఓటీపీ వినియోగదారుడికి వెళ్లకుండానే వంచకులు తెలుసుకొని నగదు తమ ఖాతాలకు జమ చేస్తారు.  

బ్లాక్‌మెయిల్‌.. 
థర్డ్‌ పార్టీ యాప్‌ల ద్వారా స్మార్ట్‌ ఫోన్లను యాక్సెస్‌ చేసే సైబర్‌కేటుగాళ్లు మొబైల్స్‌లోని డేటా, వ్యక్తిగత ఫొటోలు, వీడియోలు దొంగలించి తర్వాత ఫోన్‌ వినియోగదారులకు ఫోన్‌ చేసి బ్లాక్‌మెయిల్‌ చేసి డబ్బు వసూలు చేస్తారు. ఇలాంటి కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. 

ముందు జాగ్రత్త చర్యలు:

  • ఫోన్‌పే ఎలాంటి వ్యక్తిగత సమాచారం అడగదు. గూగుల్, ట్విట్టర్, ఫేస్‌బుక్‌లో ఫోన్‌పే వినియోగదారులు సహాయవాణి నెంబరు కోసం గాలించరాదు 
  • బ్యాంకింగ్‌ సమస్య లేదా ఏటీఎం వ్యాలిడిటి కొనసాగించే పేరుతో ఫోన్‌ చేసే వారికి సమాధానం ఇవ్వరాదు 
  • ప్లేస్టోర్‌లో పరిశీలించకుండా ఎలాంటి థర్డ్‌పార్టీ అప్లికేషన్‌ డౌన్‌లోడ్‌ చేసుకోరాదు 
  • మొబైల్‌లో పరిచయం లేని యాప్‌లను డిలిట్‌ చేయాలి 
  • ఎవరు ఫోన్‌చేసి అడిగినా ఓటీపీ, సీవీవీ, పిన్‌కోడ్‌  తెలపరాదు 
  • ప్రభుత్వం నుంచి లేదా నమ్మకమైన సంస్థ నుంచి అధికారిక యాప్‌ కాదా అని నిర్ధారించుకోవాలి.  

(చదవండి:

మరిన్ని వార్తలు