తమతో కూర్చొని భోజనం చేశాడని చంపేశారు!

4 Dec, 2021 15:51 IST|Sakshi

మృతుడి భార్య పోలీసులకు ఫిర్యాదు

డెహ్రాడూన్: ఆధునికంగా మనిషి ఎంత ఎదుగుతున్నా.. ఇంకా కులం పేరుతో జరిగే హత్యలు ఆగడం లేదు. ఓవైపు టెక్నాలజీ పెరుగుతున్నా.. మరోవైపు రోజురోజుకు దళిత, గిరిజనులపై అగ్రకులంవారి దాష్టికం తగ్గడంలేదు. తాజాగా ఓ దళిత వ్యక్తిని ఆగ్రకులానికి చెందిన కొందరు దాడి చేసి చంపారు. వివరాల్లోకి వెళితే.. ఉత్తరఖండ్‌లోని చంపావత్ జిల్లాలో ఓ గ్రామంలో జరిగిన వివాహవేడుకలో రమేశ్‌రామ్‌ అనే దళిత వ్యక్తి తమతో పాటు కూర్చొని భోజనం చేశాడని అగ్రకులానికి చెందినవారు అతనిపై దాడికి దిగారు.

చదవండి: Bigg Boss Kirik Keerthi: బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌పై బీర్‌ బాటిల్‌తో దాడి

తమకు దూరంగా ఉండి భోజనం చేయాలన్న నియయాన్ని అతడు ఉల్లంఘించాడని చావబాదారు. దీంతో తీవ్రంగా గాయపడిన రమేశ్‌రామ్‌ను స్థానికులు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. అగ్రకులానికి చెందిన కొంతమంది వివాహం వేడుకలో తన భర్తపై తీవ్రంగా దాడిచేశారు. వారి దాడి కారణంగానే తన భర్త మృతి చెందడని రమేశ్‌రామ్‌ భార్య తులసిదేవి  పోలీసులు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు.
 

మరిన్ని వార్తలు