పాత కక్షలతో తండ్రీకొడుకులపై దాడి.. మూత్రం తాగాలంటూ..

25 Jul, 2021 11:00 IST|Sakshi

జైపూర్‌: రాజస్థాన్‌లోని బార్‌మెర్‌లో దారుణం చోటు చేసుకుంది. 15 మంది వ్యక్తులు కలిసి దళిత ‍వ్యక్తిని, అతడి కొడుకుపై దాడి చేసి బలవంతంగా మూత్రం తాగించారు. పోలీసుల వివరాల ప్రకారం.. బార్‌మెర్‌లోని బిజ్రాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గోహద్ కా తాలా గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుందని తెలిపారు. కిరాణా దుకాణంలో రాయ్‌చంద్ మేఘవాల్, అతని కుమారుడు రమేష్ వస్తువులను కొనుగోలు చేస్తున్న సమయంలో దాడి జరిగినట్లు పోలీసలు పేర్కొన్నారు.  ఓ 15 మంది వ్యక్తులు అకస్మాత్తుగా తండ్రీకొడుకుల పై దాడి చేసి మూత్రం తాగమని బలవంతం చేసినట్లు వెల్లడించారు.

కులం పేరుతో దూషించి అవమానించినట్లు తెలిపారు. అంతే కాకుండా రాయ్‌చంద్‌పై దాడి చేయడంతో అతడి పంటిని కోల్పోగా.. రమేష్‌కు కాలు విరగడంతో పాటు చేతికి గాయాలయ్యాయి. కాగా, ప్రాధమిక చికిత్స కోసం బాధితులను చౌహతాన్‌కు తరలించి, తదుపరి చికిత్స కోసం బార్‌మెర్‌లోని ప్రభుత్వ వైద్య కళాశాలకు తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ కేసులో ప్రధాన నిందితుడైన ఖేత్ సింగ్ సహా 15 మందిపై కేసు నమోదు చేశారు. ఇది పాత శత్రుత్వానికి సంబంధించిన కేసుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు ప్రారంభించామని, నిందితులు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు.
 
 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు