గుడిలో దళితుడికి ఘోర అవమానం

24 Mar, 2022 06:19 IST|Sakshi

జైపూర్‌: రాజస్తాన్‌ రాష్ట్రం అల్వార్‌ జిల్లాలోని బెహ్రార్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. హిందూ దేవుళ్లను విమర్శించాడని గుడిలో ఓ దళితుడితో ముక్కు నేలకు రాయించారని పోలీసులు చెప్పారు. ఈ సంఘటనకు బాధ్యులైన 11 మందిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశామని, వీరిలో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. మిగిలిన నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశామని పేర్కొన్నారు.

పోలీసుల కథనం ప్రకారం.. ఇటీవల విడుదలైన ‘ద కశ్మీర్‌ ఫైల్స్‌’ సినిమాను విమర్శిస్తూ రాజేశ్‌ కుమార్‌ మేఘవాల్‌ అనే దళిత వ్యక్తి మూడు రోజుల క్రితం ఫేస్‌బుక్‌లో పోస్టు పెట్టాడు. దీనిపై కొందరు కామెంట్లు చేయగా, ప్రతిస్పందనగా హిందూ దేవుళ్లను(రాముడు, కృష్ణుడు) కించపరుస్తూ మళ్లీ పోస్టులు పెట్టాడు. ఈ పోస్టులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కొందరు వ్యక్తులు మంగళవారం రాజేశ్‌ కుమార్‌ను గుడికి రప్పించారు. క్షమాపణలు చెప్పించారు. తప్పు ఒప్పుకోవాలంటూ బలవంతంగా ముక్కు నేలకు రాయించారు. ఈ వీడియో దృశ్యాలు సోషల్‌ మీడియాలో సంచలనాత్మకంగా మారాయి. బాధితుడు రాజేశ్‌ కుమార్‌ మేఘవాల్‌ ఓ ప్రైవేట్‌ బ్యాంకులో పనిచేస్తున్నాడు.

మరిన్ని వార్తలు