దళితులపై దాష్టీకం.. గుంజీలు తీయించి, ఉమ్మి నాకించి అవమానం

13 Dec, 2021 13:57 IST|Sakshi

దేశంలో దళితులపై భౌతిక దాడులు జరుగుతునే ఉన్నాయి. ఇంకా గ్రామల్లో పెద్ద మనుషులు వారిపై దాష్టీకానికి తెగపడుతున్నారు. తాజాగా ఓ వ్యక్తి తనకు ఓటు వేయలేదనే కోపంతో ఇద్దరు దళితులను దారుణంగా వేధించాడు. పైశాచింకంగా గుంజీలు తీయించి.. రోడ్డు మీద ఉమ్మి నాకించాడు. దానికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటన బిహార్‌లో ఔరంగాబాద్‌ జిల్లాలోని ఓ గ్రామంలో చోటుచేసుకుంది. వివరాలు.. ఔరంగాబాద్‌ జిల్లాలోని ఓ గ్రామంలో జరిగిన సర్పంచ్‌ ఎన్నికల్లో తనకు సదరు దళితులు ఓటు వేయలేదని బల్వంత్ సింగ్ అనే వ్యక్తి వారిపై దాడికి దిగాడు.

ఓటు వేయాలని వారికి డబ్బులు ఇచ్చానని, వారు ఓటువేకపోవటంతో రెండు ఓట్ల తేడాతో ఓడిపోయానని దూషించాడు. వారిద్దని రోడ్డు మీదకు లాక్కొచ్చి.. ఓటు వేయనందుకు శిక్షగా గుంజీలు తీయించాడు. అంతటితో ఆగకుండా అవమానపరచాలని బలంవంతంగా రోడ్డు మీద ఉమ్మి నాకించాడు. సమాచారం అందుకున్న పోలీసులు బల్వంత్ సింగ్ అరెస్టు చేశారు. ఈ ఘటనపై అన్ని కోణాల్లో విచారణ చేస్తామని పోలీసులు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు