గడ్డి కోసం వెళ్లిన మహిళపై తుపాకితో బెదిరించి సామూహిక లైంగిక దాడి

12 Oct, 2021 11:51 IST|Sakshi

లక్నో: దేశంలో మహిళలపై జరుగుతున్న ఆగడాలకు అడ్డుకట్ట కోసం ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా అవి ఆశించినంత ఫలితాలు ఇవ్వడం లేదనే చెప్పాలి. తాజాగా ఒంటరిగా పొలానికి వెళ్లిన మహిళపై నలుగురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని జేవార్‌ ప్రాంతంలో చోటుచేసుకుంది. ఈ అఘాయిత్యానికి పాల్పడిన ముగ్గురు నిందితులు పరారీలో ఉండగా, ఒకడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. ఝలావర్‌ జిల్లాలోని ఓ దళిత మహిళ గడ్డి కోసం పోలానికి ఒంటరిగా వెళ్లింది.

అయితే ఆ పరిసరాల్లో ఉన్న నలుగురు వ్యక్తులు ఎవరూ లేని సమయం చూసి మహిళపై దౌర్జన్యానికి తెగబడ్డారు. ఆమె ప్రతిఘటించడంతో తుపాకితో బెదిరించి ఆమెపై ఆ నలుగురు అఘాయిత్యానికి ఒడిగట్టారు. ఈ ఘటనపై మహిళ భర్త ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటోందని ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని పోలీసులు తెలిపారు.

బీఎస్‌పీ, కాంగ్రెస్‌తో సహా విపక్షాలు నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. బీఎస్పీ అధినేత్రి మాయావతి ఈ ఘటనను ఖండిస్తూ.. గౌతమ్ బుద్ధ నగర్‌లో దళిత మహిళపై సామూహిక అత్యాచారం చేయడం చాలా విచారకరం, సిగ్గుచేటు.  బీజేపీ ప్రభుత్వాన్ని బీఎస్పీ డిమాండ్ చేస్తుంది. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతున్నామని " ఆమె హిందీలో ట్వీట్ చేశారు.

చదవండి: అమ్మాయిలతో అశ్లీల నృత్యాలు.. రియల్‌ ఎస్టేట్‌ సంస్థ నిర్వాకం


 

మరిన్ని వార్తలు