కూతురితో ప్రేమ వ్యవహారం.. యువకుడిని కిడ్నాప్‌ చేసి..

6 Oct, 2021 19:17 IST|Sakshi
ఫైల్‌ ఫోటో

అహ్మ‌దాబాద్: తమ అమ్మాయిని ప్రేమిస్తున్నాడనే కోపంతో ఆమె కుటుంబ స‌భ్యులు ఓ ద‌ళిత యువ‌కుడిని అప‌హ‌రించి చిత్ర హింసలకు గురిచేశారు. ఈ దారుణ ఘ‌ట‌న గుజ‌రాత్‌లో వెలుగుచూసింది. వివరాల ప్రకారం.. మేఘానిన‌గ‌ర్‌కు చెందిన రాహుల్ చమర్‌ అనే యువకుడు వినోద్‌ దుతానియా కూతురితో ప్రేమ వ్యవహారం నడిపిస్తున్నాడని అతనికి తెలిసింది. దీంతో ఆగ్రహించిన దుతానియా అతని సహచరులతో కలిసి రాహుల్‌ని అక్టోబర్ 1న బాపూర్ నగర్‌లోని డి-మార్ట్ దుకాణం వెలుపల ఉన్నప్పుడు అపహరించారు.

ఈ విషయం బాధితుడి కుటుంబసభ్యులకు తెలియడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులకు అక్టోబర్ 2 రాత్రి, ఆ యువకుడిని షహేర్‌కోటలోని విజయ్ మిల్‌లో బందీగా ఉంచినట్లు తెలుసుకున్నారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకోగా, బాధితుడి ముఖం, శరీరంపై తీవ్ర గాయాలతో కనిపించాడు. అంతేకాకుండా రాహుల్ చేతులు, కాళ్లని కట్టేసి నిందితులు తీవ్రంగా హింసించారు. రాహుల్‌ని కాపాడిన పోలీసులు అతడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి త‌ర‌లించారు. నిందితులు వినోద్ దుతానియా, అతనికి సహాయం చేసిన వారిని అరెస్ట్ చేశారు.
చదవండి: తల్లీకొడుకు ప్రాణాలు తీసిన బజ్జీలు

మరిన్ని వార్తలు