డ్యాన్స్‌ స్కూల్‌: కొవ్వు తగ్గిస్తానని చెప్పి గదిలోకి తీసుకెళ్లి..

3 Apr, 2021 08:23 IST|Sakshi

నిందితుడి అరెస్టు

సాక్షి, కంటోన్మెంట్‌: డ్యాన్స్‌ స్కూల్‌లో బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించిన నిర్వాహకుడిని బోయిన్‌పల్లి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇన్‌స్పెక్టర్‌ రవికుమార్‌ వెల్లడించిన వివరాల మేరకు తిరులమగిరి దుర్గావిహార్‌ కాలనీలో నివాసముండే బాలిక బోయిన్‌పల్లి మార్కెట్‌ సమీపంలోని అర్బన్‌ డ్యాన్స్‌ వరల్డ్‌లో మూడు నెలలుగా శిక్షణ తీసుకుంటోంది. ఈ క్రమంలో సంబంధిత డ్యాన్స్‌ స్కూల్‌ నిర్వాహకుడు సుదర్శన్‌ బాలిక నడుము వద్ద కొవ్వును తగ్గిస్తానని, అందుకు ప్రతిరోజూ ఉదయం 7 నుంచి 8గంటల సెషన్‌లో వర్కవుట్స్‌కు రావాల్సిందిగా సూచించాడు.

దీంతో బాలిక గత నెల 26 నుంచి ఉదయం వేళలో వర్కవుట్స్‌కు వెళ్తోంది. తను ఇచ్చే శిక్షణకు సంబంధించి ఇన్‌స్ట్రాగామ్‌ రీల్‌ చేయాల్సి ఉంటుందని బాలికకు సూచించాడు. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం వర్కవుట్స్‌ సమయంలో డ్యాన్స్‌ స్కూల్‌కు వచి్చన బాలికను ఓ గదిలోకి తీసుకెళ్లి ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. మరుసటి రోజు బాలిక ఇంట్లో వాళ్లకు విషయం తెలుపగా డయల్‌ 100 ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు.  

చదవండి: భర్త మందలింపు; టైలరింగ్‌ షాప్‌కు వెళ్తున్నానని చెప్పి..

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు