దర్భంగా కేసు : హైదరాబాద్‌ కేంద్రంగా ఎన్‌ఐఏ విచారణ

5 Jul, 2021 10:19 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దర్భంగ రైల్వే స్టేషన్‌లో జరిగిన విస్ఫోటం కేసులో హైదరాబాద్‌ కేంద్రంగా విచారణ కొనసాగనుంది. నలుగురు ఉగ్రవాదులు ఇమ్రాన్‌ మాలిక్‌, నాసిర్‌ మాలిక్‌, హాజీ సలీం, ఖాఫిల్‌ను జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) కస్టడీలోకి తీసుకున్నారు. ఈనెల 9 వరకు ఎన్‌ఐఏ కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం ఢిల్లీ ఎన్‌ఐఏ కార్యాలయంలో విచారణ కొనసాగుతోంది. 

హైదరాబాద్‌ కేంద్రంగా బాంబు తయారుచేసిన నేపథ్యంలో.. హైదరాబాద్‌ నుంచే ఎన్‌ఐఏ విచారణ చేపట్టనుంది. బాంబు తయారీ, అమర్చిన తీరుపై ఎన్‌ఐఏ రీకన్‌స్ట్రక్షన్‌ చేసే అవకాశం ఉ‍న్నట్లు తెలుస్తోంది. ఎన్‌ఐఏ రెండ్రోజుల్లో నిందితులను హైదరాబాద్‌కు తీసుకురానుంది. ఇప్పటికే ఢిల్లీ ఎన్‌ఐఏ బృందం హైదరాబాద్‌కు చేరుకుంది. 

మరిన్ని వార్తలు