అమ్మాయిలతో కాల్‌సెంటర్‌..డేటింగ్‌ ముఠా అరెస్ట్‌

13 Oct, 2020 18:49 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : డేటింగ్ యాప్ పేరుతో 16 మంది అమ్మాయిలతో కాల్ సెంటర్ నిర్వహిస్తున్న ఇద్దరు వ్యక్తులను హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. కోల్‌కతాలో ఉన్న కాల్‌ సెంటర్‌పై దాడి చేసి నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు. అలాగే 16 మంది యువతులకు 41 సీఆర్‌పీ సెక్షన్‌ కింద నోటీసులు అందజేశారు. ఆనంద్‌కర్‌, బుద్దపాల్‌ అనే ఇద్దరు వ్యక్తులు ఈ కాల్‌ సెంటర్‌ను నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వీరిద్దరి అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. వీరు దేశ వ్యాప్తంగా మోసాలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. నిందితులను నుంచి 2 ల్యాప్‌టాప్‌లు, 24 సెల్‌ఫోన్లు, 51 సిమ్‌ కార్డులను స్వాధీనం చేసుకున్నారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు