కోడలిపై దుర్మార్గం: ఆడపిల్ల పుట్టబోతోందని తెలిసి.. పాలలో విషప్రయోగం

15 Nov, 2022 11:12 IST|Sakshi

గుంటూరు: ఆడపిల్లకు జన్మనిస్తుందనే కారణంతో అత్తమామల విషప్రయోగంతో కోడలు వారం రోజులుగా చికిత్స పొందుతూ సోమవారం ప్రాణాలు విడిచింది. పోలీసులు, బంధువులు తెలిపిన వివరాలు.. మండలంలోని సుబ్బయ్యపాలేనికి గ్రామానికి చెందిన గాడిపర్తి వేణుతో బాపట్ల జిల్లా బల్లికురవ మండలం కొప్పెరపాడుకు చెందిన శ్రావణికి 2020లో వివాహమైంది. శ్రావణికి మొదటి కాన్పులో అమ్మాయి పుట్టింది. రెండోసారి గర్భం దాలి్చంది. 

భర్త, అత్తమామలు లింగ నిర్ధారణ పరీక్షలు చేయించారు. రెండోసారి కూడా అమ్మాయి పుడుతుందని తెలుసుకున్నారు. ఇష్టం లేని అత్తమామలు ఆమెపై మజ్జిగ, పాలలో విషప్రయోగం చేశారని శ్రావణి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అంతేగాకుండా శ్రావణి రక్తం, చిన్న పేగు ముక్కలతో వాంతి చేసుకుంది. ఈ పరిస్థితుల్లో నరసరావుపేటలోని ప్రైవేటు వైద్యశాలలో చేర్పించారు. 

కోమాలోకి వెళ్లిన శ్రావణి పరిస్థితి విషమించటంతో విజయవాడలోని ప్రైవేటు హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందింది. ఆమెకు అక్కడనే పోస్టుమార్టం నిర్వహించారు. ఈ ఘటనపై పోస్టుమార్టం నివేదిక ఆధారంగా దర్యాప్తు చేయనున్నట్లు ఎస్‌ఐ సురేష్ బాబు  తెలిపారు.    

మరిన్ని వార్తలు