అత్తపై కోడలు భారీ స్కెచ్‌.. విస్తుపోయే షాకింగ్‌ నిజాలు బట్టబయలు

5 Aug, 2022 10:44 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

పెడన(కృష్ణా జిల్లా): కుటుంబ కలహాల నేపథ్యంలో అత్తపై కక్ష పెట్టుకున్న కోడలు.. ఆమెను కిరాతకంగా హత్య చేసింది. ఆపై దానిని ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది. అయితే పోస్టు మార్టం రిపోర్టు అసలు విషయాన్ని బహిర్గతం చేయడంతో కోడలు జైలు పాలయ్యింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు సీఐ ప్రసన్న వీరయ్యగౌడ్‌ పెడన పోలీస్‌ స్టేషన్‌లో గురువారం విలేకరులకు వెల్లడించారు.
చదవండి: ఒంటరి మహిళలే టార్గెట్‌.. వారితో చనువు పెంచుకుని.. హోటల్‌కు తీసుకెళ్లి..

మొదటి నుంచీ గొడవలే.. 
పెడన పరిధిలోని కృష్ణాపురానికి చెందిన పడమట వీరబాబుతో కొండాలమ్మకు వివాహం జరిగి దాదాపు 12 ఏళ్లు అయ్యింది. ఈ క్రమంలో అత్త, కోడళ్లు తరచూ గొడవ పడుతుండేవారు. దీంతో అత్త రజనీకుమారి(50)పై కక్ష పెట్టుకున్న కోడలు కొండాలమ్మ ఆమె అడ్డు తొలగించుకునేందుకు గత నెల 27వ తేదీన విచక్షణ రహితంగా కర్రతో తలపై బలంగా కొట్టింది. ఆపై పీక పిసికి చంపేందుకు ప్రయత్నించింది. అప్పటికీ చనిపోకపోవడంతో చీరను మెడకు బిగించింది. ఆమె నోరు, ముక్కు నుంచి రక్తం రావడంతో స్పృహ కోల్పోయింది. దీంతో అత్త చనిపోయిందని భావించి తన భర్తకు, బంధువులకు సమాచారం అందించింది. 

ప్రమాదం అంటూ కలరింగ్‌.. 
తాను చేసిన తప్పును కప్పిపుచ్చుకునేందుకు అత్త కాలుజారి వరండాలో పడిపోయి తీవ్రంగా గాయపడినట్లు భర్త, బంధువులకు ఫోన్‌ చేసి చెప్పింది. ఇంటికి వచ్చిన కుమారుడు, కూతురు తీవ్ర గాయాలతో ఉన్న తల్లిని మచిలీపట్నం ప్రభుత్వ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం చేర్చారు. అక్కడ పరిస్థితి విషమించడంతో ఆమెను మెరుగైన చికిత్స కోసం విజయవాడ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గత నెల 30వ తేదీన రజనీకుమారి మరణించింది. ఈ క్రమంలో మృతురాలి కుమారుడు వీరబాబు తన తల్లి ఇంట్లో ప్రమాదవశాత్తు పడటంతో తీవ్ర గాయాలైనట్లు పేర్కొనడంతో అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు.

పట్టించిన పోస్టు మార్టం రిపోర్టు.. 
విజయవాడ వైద్యులు ఇచ్చిన పోస్ట్‌మార్టం రిపోర్టులో కోడలు చేసిన అసలు విషయం వెలుగు చూసింది. మృతురాలి తలకు బలమైన దెబ్బ తగలడం.. ఆపై ఊపిరి ఆడక చనిపోయినట్లు నివేదిక స్పష్టం చేసింది. దీంతో అనుమానించిన పోలీసులకు గ్రామంలో అందిన సమాచారంతో కోడలు కొండాలమ్మను తమదైన శైలిలో విచారించారు. దీంతో కొండాలమ్మ తానే అత్తను హత్య చేసినట్లు అంగీకరించింది. అత్తను చంపడానికి ఉపయోగించిన చీరను కూడా స్వా«దీనం చేసుకున్నామని సీఐ చెప్పారు. దీంతో కేసును హత్య కేసుగా మార్చి.. నిందితురాలు కొండాలమ్మను కోర్టులో హాజరు పరిచామని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు