అండర్ వరల్డ్ డాన్‌ దావూద్ ఇబ్రహీం సోదరుడు అరెస్టు

23 Jun, 2021 16:38 IST|Sakshi

ముంబై: అండర్‌ వరల్డ్‌ మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం సోదరుడు ఇక్బాల్ కస్కర్‌ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) అధికారులు ముంబైలో అదుపులోకి తీసుకున్నారు. డ్రగ్స్ కేసులో ఇక్బాల్ కస్కర్‌ను అరెస్టు చేసినట్లు ఎన్‌సీబీ ధృవీకరించిందని వార్తా సంస్థ ఎఎన్‌ఐ తెలిపింది. జమ్మూ కశ్మీర్, పంజాబ్‌  నుంచి  డ్రగ్స్‌ తీసుకుని వచ్చి ముంబైలో సరఫరా చేస్తుండగా అరెస్టు చేసినట్లు పేర్కొంది. ఇరవై ఐదు కిలోల డ్రగ్స్‌ను కూడా ఎన్‌సీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు మీడియాలో కథనాలు వస్తున్నాయి.

ఇదిలాఉండగా.. గతంలో కస్కర్ పై మనీలాండరింగ్  కేసుతో పాటు,  ఒక  బిల్డర్‌ నుంచి బెదిరించి డబ్బు  దోచుకున్నట్లు ఆరోపణలు రావడంతో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అతనిపై కేసు నమోదు చేసింది. దీనికి సంబంధించి ముంబై పోలీసులు దాఖలు చేసిన చార్జిషీట్‌లో పరారీలో ఉన్న దావూద్ ఇబ్రహీం అనుచరడు చోటా షకీల్, గ్యాంగ్‌స్టర్లు ఇస్రార్ జమీల్ సయ్యద్, ముంతాజ్ ఎజాజ్ షేక్ పంకజ్ గంగార్లను నిందితులుగా పేర్కొన్నారు.
చదవండి:పక్కింటివాళ్లతో గొడవ.. 12వ అంతస్తు నుంచి దూకిన మహిళ

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు