ఆన్‌లైన్‌ క్రికెట్‌ బెట్టింగ్‌ గుట్టురట్టు

20 Sep, 2020 12:56 IST|Sakshi

సాక్షి, కృష్ణా: బెజవాడ నగరం కేంద్రగా క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠా గుట్టురట్టైంది. ఆన్‌లైన్‌లో ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా మ్యాచ్‌పై భారీగా బెట్టింగ్‌లు నిర్వహించిన ముఠాను పోలీసులు ఆదివారం పట్టుకున్నారు. అన్‌లైన్ బెట్టింగ్‌కు సంబంధించిన సెటప్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అదే విధంగా నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బెజవాడలో ఓ ఇల్లు అద్దెకు తీసుకుని బెట్టింగ్ నిర్వహిస్తున్నరని, ఈ మూఠా తూర్పు గోదావరి జిల్లా చెందిందిగా పోలీసులు వెల్లడించారు. డీసీపీ హర్షవర్ధన్ రాజు మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. మొగల్రాజపురంలో ఆచార్య ప్లే స్కూలులో క్రికెట్ బెట్టింగ్ జరుగుతున్నట్టు సమాచారం అందిందని తెలిపారు.

దీంతో అక్కడికి చేరుకొని బెట్టింగ్ సామాగ్రి మొత్తం స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. అవతార్ అనే యాప్ ద్వారా ఈ బెట్టింగ్ నడిపిస్తున్నారని వెల్లడించారు. బాగా తెలిసిన వాళ్ల ద్వారానే ఈ బెట్టింగ్ యాప్‌లో బెట్టింగ్‌ కాస్తున్నారని చెప్పారు. రూ.12 లక్షల వరకూ బెట్టింగ్ జరుగుతోందని సమాచారం వచ్చిందన్నారు. ఇక ఈ ముఠాకు చెందిన ప్రధాన సూత్రధారి నవీన్‌ను త్వరలో అదుపులోకి తీసుకుంటామని తెలిపారు. ఐపీఎల్ రోజుల్లో పోలీసులకు బెట్టింగ్‌పై సమాచారం ఇచ్చి సహకరించాలని ప్రజలను కోరారు. ఈ వ్యాలెట్ ద్వారా నగదు లావాదేవీలు చేస్తున్నారని చెప్పారు. విద్యార్ధులు ఇలాంటి బెట్టింగ్‌లకు ఆకర్షితులు కావద్దని విజ్ఞప్తి చేశారు.

మరిన్ని వార్తలు