సెల్ఫీ సరదా రెండు నిండు ప్రాణాలను తీసింది

24 Nov, 2021 08:13 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

మైసూరు(బెంగళూరు): చెరువు కట్ట పైన నిలబడి మొబైల్‌ ఫోన్‌లో సెల్ఫీ తీసుకుంటు ఇద్దరు యువకులు చెరువులో పడి మృతి చెందారు. ఈ సంఘటన హుణసూరు తాలూకాలోని హోసకోటె దగ్గర  కెంచన చెరువులో చోటు చేసుకుంది. మృతులు అబ్దుల్లా (21), తన్వీర్‌ (20). ముగ్గురు కలిసి చెరువు చూడడానికి వచ్చారు. కట్టపై నిలబడి సెల్ఫీ తీసుకుంటున్న సమయంలో ఇద్దరు జారిపడ్డారు. చెరువు లోతుగా ఉండడంతో ఈదలేక మృత్యువాత పడ్డారు. హుణసూరు గ్రామీణ పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేశారు.

మరో ఘటనలో..
రౌడీషీటర్‌ అరెస్ట్‌
శివమొగ్గ: వ్యాపారుల ను బెదిరించి దందాలు చేయడంతోపాటు అనేక నేరాలతో సంబంధం కలిగి ముంబైలో తలదాచుకున్న శివమొగ్గ నగరంలోని టిప్పు నగర్‌కు చెందిన పేరుమోసిన రౌడీషీటర్‌ బచ్చన్‌(29)ను శివమొగ్గ పోలీసులు ముంబైలో అరెస్ట్‌ చేశారు. ఇతనిపై జిల్లాలోని అనేక పోలీస్‌స్టేషన్లలో 53 కేసులున్నాయి. నిందితుడిని అరెస్ట్‌ చేసేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు  చేశారు. ఈక్రమంలో  బసవనగుడికి చెందిన మహ్మద్‌ తౌహిద్‌(19), మహ్మద్‌ బిలాల్‌(21)ను నవంబర్‌ 16న  పోలీసులకు పట్టుబడ్డారు. వారు ఇచ్చిన ఆధారాలతో పోలీసులు ముంబై వెళ్లి బచ్చన్‌ను పట్టుకొచ్చారు.

చదవండి: అయ్యో భగవంతుడా.. తండ్రి కారు కాటికి పంపింది

మరిన్ని వార్తలు