దీక్షిత్‌ రెడ్డి తల్లిదండ్రుల మీడియా సమావేశం

28 Oct, 2020 11:40 IST|Sakshi
మీడియా సమావేశంలో దీక్షిత్‌ తల్లిదండ్రులు

సాక్షి, మహబూబ్‌నగర్‌ : నగరానికి చెందిన మందా సాగర్‌ అనే యువకుడి చేతిలో కిడ్నాప్‌, హత్యకు గురైన తొమ్మిదేళ్ల బాలుడు దీక్షిత్‌ రెడ్డి తల్లిదండ్రులు బుధవారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. నిందితుడు సాగర్‌ను మరోసారి విచారించి, వెంటనే శిక్షించాలని కోరారు. పోలీసులు తమ కుటుంబానికి న్యాయం చేస్తారన్న నమ్మకం ఉందన్నారు. ఇంకా వారు మాట్లాడుతూ.. ‘‘ ఈ నెల 18వ తేదీ సాయంత్రం దీక్షిత్‌ రెడ్డిని కిడ్నాప్ చేసి, వెంటనే హత్య చేశారు. ఇది దురదృష్టకరం. 300 మంది పోలీసులు విస్తృతంగా గాలింపు చేపట్టారు. అయినా దీక్షిత్ రెడ్డి ఆచూకీ లభించలేదు. మీడియా, ప్రజలు బాగా కష్ట పడ్డారు. ( డెంటల్‌ డాక్టర్‌ కిడ్నాప్‌ కథ సుఖాంతం )

దీక్షిత్ రెడ్డి క్షేమంగా వస్తాడని ఎదురు చూశారు. దీక్షిత్ రెడ్డి కిడ్నాప్ ఉదంతాన్ని చూసి హైదరాబాద్‌లో మరో సంఘటన జరిగింది. భవిష్యత్‌లో ఇది రోల్ మోడల్‌గా మారే  అవకాశం ఉంది. దేశంలో తెలంగాణ పోలీసులు అన్ని రంగాల్లో ముందున్నారు. కానీ దురదృష్టవశాత్తు దీక్షిత్ తిరిగిరాలేదు. ఇది మా దురదృష్టం. నిందితుడికి వెంటనే మరణ శిక్ష పడే విధంగా పోలీసులు కృషి చేయాలి. రాష్ట్ర ప్రజలంతా ఆ శిక్ష కోసం ఎదురు చూస్తున్నార’’ని అన్నారు.

మరిన్ని వార్తలు