ఆన్‌లైన్‌ గేమ్స్‌ వద్దన్నందుకు డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య

29 Apr, 2022 04:38 IST|Sakshi

ముదిగుబ్బ: ఆన్‌లైన్‌ గేమ్స్‌ ఓ విద్యార్థి ప్రాణాలను బలిగొన్నాయి. వివరాలు.. అనంతపురం జిల్లా ముదిగుబ్బ మండలం గుట్టకిందపల్లికి చెందిన సంతోష్‌కుమార్‌(20) డిగ్రీ చదువుతున్నాడు. మొబైల్‌లో ఆన్‌లైన్‌ గేమ్‌లకు బానిసై డిగ్రీ సెకండియర్‌ మధ్యలోనే మానేశాడు. ఇంటివద్దే ఉంటూ ఆన్‌లైన్‌ వీడియో గేమ్‌లు ఆడేవాడు. ఈ విషయమై తల్లిదండ్రులు గురువారం సంతోష్‌ను నిలదీశారు.

చదువులు మానేసి ఆన్‌లైన్‌ గేమ్‌లు ఆడుతూ కూర్చొంటే ఎలా బతుకుతావంటూ మందలించారు. దీంతో మనస్తాపానికి గురైన సంతోష్‌ పురుగుమందు తాగి అపస్మారకస్థితికి చేరుకున్నాడు. కుటుంబసభ్యులు వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించి సంతోష్‌ మృతిచెందాడు. పట్నం ఎస్‌ఐ సాగర్‌ కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.  

మరిన్ని వార్తలు