కుటుంబం మొత్తాన్ని నరికి చంపిన పూజారి.. మృతదేహాల వద్ద క్షుద్రపూజలు

29 Aug, 2022 12:05 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

డెహ్రాడూన్‌: ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలో ఘోర ఘటన చోటుచేసుకుంది. కుటుంబం మొత్తాన్ని ఓ ఉన్మాది అతి కిరాతకంగా హత్య చేశాడు. ఉత్తర​ ప్రదేశ్‌లోని బండాకు చెందిన మహేష్‌ కుమార్‌ తివారీ అనే వ్యక్తి పూజారీగా పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. గత ఏడేళ్లుగా డెహ్రాడూన్‌లోని రాణి పోఖారీలో నివసిస్తున్నాడు. ఏం జరిగిందో తెలియదు కానీ సోమవారం ఉదయం సొంత కుంటుంబాన్ని నరికి చంపాడు.

47 ఏళ్ల పూజారి కుటుంబంలోని అయిదగురిని కత్తితో పొడిచి హత్య చేశాడు. మృతుల్లో నిందితుడి తల్లి, భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. హత్య అనంతరం మృతదేహాల వద్ద క్షుద్రపూజలు నిర్వహించాడు. ఈ సంఘటన సోమవారం ఉదయం 7:30 గంటలకు జరిగింది. అయితేఇంట్లో నుంచి కుటుంబ సభ్యుల అరుపులు విన్న ఇరుగుపొరుగు వారు పోలీసులకు తెలియజేశారు.  

సమాచారం అందుకున్న డెహ్రాడూన్ పోలీసు అధికారులు ఘటనాస్థలికి చేరుకున్నారు. అనంతరం నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు డెహ్రాడూన్ పోలీసు సూపరింటెండెంట్ (రూరల్) కమలేష్ ఉపాధ్యాయ్ తెలిపారు. నిందితుడు ఇంత దారుణానికి ఎందుకు తెగబడ్డానేది ఇంకా తెలియలేదని, దీనిపై విచారణ చేస్తున్నట్లు పేర్కొన్నారు.
చదవండి: వివాహేతర సంబంధం: ప్రియుడితో కలిసి మూడేళ్ల కొడుకుని హతమార్చిన తల్లి

మరిన్ని వార్తలు