ఇంటికి నిప్పంటించిన దుండగులు.. గాఢ నిద్రలో కుటుంబం.. క్షణాల్లో..

13 Jan, 2023 19:05 IST|Sakshi

న్యూఢిల్లీ: ఈశాన్య ఢిల్లీ భజన్‌పురలోని వినయ్ పార్కులో భయానక ఘటన జరిగింది. ముసుగు ధరించిన ఇద్దరు దుండగులు అమానవీయ ఘటనకు పాల్పడ్డారు. ఓ ఇంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. అనంతరం అక్కడి నుంచి పారిపోయారు.

అదృష్టవశాత్తు ఆ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు వెంటనే నిద్రలేచారు. మంటలు ఇల్లంతా అంటుకోకముందే ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటనలో వాళ్లుకు ఎలాంటి గాయాలు కాలేదు. అయితే ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

ఈ వీడియోలో ముసుగు ధరించిన దుండగులు నఫీజ్ ఇంటి వద్దకు వెళ్లినట్లు ఉంది. అనంతరం ఇద్దరిలో ఒకడు తన వెంట తెచ్చుకున్న పెట్రోల్ ఇంటి గడపపై పోశాడు. అనంతరం మరొకడు అగ్గిపుల్ల అంటించి విసిరాడు. మంట అంటుకోకపోవడంతో మరోసారి విసిరాడు. చివరకు ముడో ప్రయత్నంలో మంట అంటుకుని చెలరేగింది. వెంటనే  వెంటనే ఇద్దరు అక్కడి నుంచి పారిపోయారు.

పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.  అయితే నిందితులను ఇంకా గుర్తించలేకపోయారు. వాళ్లు నఫీజ్‌కు తెలిసినవాళ్లేనా అని ఆరా తీస్తున్నారు. త్వరలోనే దుండగులను పట్టుకుంటామన్నారు.
చదవండి: యువతిని కారుతో ఈడ్చుకెళ్లిన ఘటన.. కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయం

మరిన్ని వార్తలు