దొంగతనం ఆరోపణలతో.... పనిమనిషిని చిత్రహింసలకు గురిచేసి...

15 Aug, 2022 14:46 IST|Sakshi

దొంగతనం చేసిందనే ఆరోపణలతో ఒక కుటుంబం పనిమినిషిని చిత్రహింసలు పెట్టి ఆత్మహత్య చేసుకుని చనిపోయే స్థితికి తీసుకు వచ్చింది. ఇంతలా అభివృద్ధి చెందుతున్న ఈ కాలంలో కూడా ఆ కుటుంబం ఒక మంత్రగాడి మాటలు నమ్మి పనిమనిషి పట్ల అమానుషంగా ప్రవర్తించింది. ఈ ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. 

వివరాల్లోకెళ్తే...ఢిల్లీలో సత్‌బరిలోని అన్సల్ విల్లాలో ఉంటున్న ఒక కుటుంబం ఇంట్లో పది నెలల క్రితం ఒక దొంగతనం జరిగింది. ఐతే ఆ కుంటుంబికులు దొంగను కనిపెట్టేందుకు ఒక మంత్రగాడిని సంప్రదిస్తారు. అతను ఇంట్లో పనివాళ్లందరికీ సున్నం, అన్నం కలిపి ప్టెటమని చెప్పాడు. అది తిన్నప్పుడూ ఎవరి నోరు ఎర్రగా అవుతుందో వాళ్లే దొంగ అని చెప్పాడు.

ఐతే బాధితురాలు తన కుటుంబంతో కలసి సదరు యజమాని కుంటుంబం వద్దే ఉంటుంది. వారి ఇంట్లోనే ఆమె రెండేళ్లుగా పనిమనిషిగా పనిచేస్తోంది. ఆ మాంత్రికుడు చెప్పినట్లుగానే ఇంట్లో పనిచేసే వాళ్లందరికి పెట్టారు. ఈ అన్నం తిన్న బాధితురాలి ముఖం ఎర్రగా మారింది. అంతే ఆమే దొంగ అని భావించి బట్టలు విప్పించి గదిలో బందించి కొట్టడం వంటి పనులు చేశారు.

ఐతే ఆమె ఈ అవమానాన్ని భరించలేక ఎలకల మందు తిని ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించింది. దీంతో సదరు కుటుంబికులు ఆమెను ఆస్పత్రికి తీసుకువెళ్లడంతో ఈ విషయం వెలుగు చూసింది. దీంతో బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు సదరు కుటుంబం పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం ప్రారంభించారు.

(చదవండి: మూడుముళ్లంటూ టీచర్‌కు మస్కా )

మరిన్ని వార్తలు