పవన్ కళ్యాణ్ జల్సా సినిమా సీన్‌ను గుర్తు చేసిన ఢిల్లీ గ్యాంగ్‌స్టర్స్‌

26 Aug, 2021 02:40 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

ఢిల్లీ:  గ్యాంగ్‌స్టర్స్‌ లాక్ అప్‌లో ఉండి జల్సా సినిమాలోని సీన్లను రిపీట్ చేశారు. దానికి సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇక వివరాల్లోకి వెళితే..దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో​ పవర్‌స్టార్‌ పవన్ కల్యాణ్ హీరోగా నటించిన జల్సా సినిమాను చూసి ఉంటారుగా.. ఆ సినిమాలోని విలన్ ముకేష్ రిషి జైలు నుంచే సెటిల్మెంట్లు, దందాలు చేస్తూ ఉంటాడు. అయితే ఆ సన్నివేశం ప్రారంభంలో అది జైలు అని మనకు ఏ మాత్రం అనిపించదు. విచారణ నిమిత్తం కోర్టు నుంచి జైలుకు వెళ్లే దారిలో మర్డర్లు కూడా చేసి వస్తాడు ఆ సినిమాలోని విలన్. సినిమాలో చూడటానికి ఆ సన్నివేశం ఎంత బాగున్నా కూడా నిజ జీవితంలో ఇలా జరుగుతాయా అని మనం అనుకుంటూవుంటాం. అయితే తాజాగా అలాంటి సంఘటనలతో కూడిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌ అయింది. 

కాకపోతే ఆ సినిమాలో జైలు నుంచి చేస్తే ఈ వీడియోలో మాత్రం లాకప్ నుంచి. నలుగురు వ్యక్తులు లాకప్లో హ్యాపీగా కుర్చొని మద్యం తాగుతూ అందులో కలుపుకోవడానికి కూల్ డ్రింగ్స్, తినడానికి స్నాక్స్‌తో పాటు చేతిలో సిగరెట్టుతో ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్నట్లు ఆ వీడియోలో ఉంది. ఇదిలా ఉంటే లాకప్‌లోని మరొక గ్యాంగ్‌స్టర్ సరదాగా ఫోన్లో మాట్లాడుతున్నట్టుగా ఆ వీడియోలో ఉంది. అయితే ఈ వీడియోని ఆ జైలులో ఉన్న ఢిల్లీకి చెందిన ఓ గ్యాంగ్‌స్టర్ నీరజ్ బవన పోస్ట్ చేయడం ఇందులోని ట్విస్ట్ అని చెప్పాలి. అంతే కాదు ఆ వీడియోలో ఉన్నది నీరజ్ బవన సోదరులైన రాహుల్ కాలా, నవీన్ బాలి కావడం ఇందులోని మరో ట్విస్ట్. 

A post shared by Neeraj_bawana_ (@neeraj_bawanaa_official_)

అయితే అప్పటికే రాహుల్ కాలా, నవీన్ బాలి జైలులో ఉండగా ఈ నెల ఐదవ తారీకున పోలీసులు వారిని మళ్లీ అరెస్టు చేశారు. కస్టడిలో ఉంచి విచారణ చేసిన పోలీసులు ఆగస్టు 10న వీరిని తిరిగి జైలుకు పంపించారు. ఇదిలా ఉంటే వీళ్లను మళ్లీ అరెస్టు చేసింది కూడా జైలు నుంచి బయటి వారిని బెదిరింపులకు గురి చేసినందుకు కావడం గమనార్హం. ఇంకా ఈ వీడియోలో వీరున్న సెల్‌కి ఎదుట సెల్లో కొందరు ఖైదీలు కూడా కనిపిస్తున్నారు. అయితే ఈ వీడియోలో ఇదంతా స్పష్టంగా కనిపిస్తున్నా కూడా తమకు ఏమీ తెలియనట్టుగా లాకప్‌లో మద్యం అందించబడదని జరిగిన సంఘటణపై విచారణ చేస్తామని చెప్పి సైలెంట్ అయిపోయారు. ఇదిలా ఉండగా ఈ వీడియో మాత్రం ఇంటర్ నెట్లో వైరలై చక్కర్లు కొడుతోంది.

మరిన్ని వార్తలు