‘భారత్‌ రహస్యాలు లీక్‌ చేస్తున్న ఢిల్లీ జర్నలిస్టు అరెస్టు’

19 Sep, 2020 15:33 IST|Sakshi

న్యూఢిల్లీ : భారత్‌కు చెందిన సున్నతమైన సమాచారాన్ని చైనా ఇంటెలిజెన్స్‌కు చేరవేసిన కేసులో మరో ఇద్దరు వ్యక్తులను ఢిల్లీ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. నిందుతుల్లో ఢిల్లీ జర్నలిస్టు రాజీవ్ శర్మ అనే వ్యక్తి తోపాటు చైనా మహిళ ఉన్నారు. చైనాకు చెందిన గూఢచారి ఏజెన్సీలతో భారత రహస్య రక్షణ పత్రాలను పంచుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ రాజీవ్ శర్మను ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ విచారించిన అనతరం అతడిని అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి పెద్ద మొత్తంలో మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ఇతర వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. (జాతీయ భద్రతకు సంబంధించిన డేటా హ్యాక్‌..!)

పోలీసుల వివరాల ప్రకారం.. ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పనిచేస్తున్న న్యూఢిల్లీలోని పితమ్‌పురాకు చెందిన రాజీవ్ శర్మ  విలేఖరి ముసుగులో చైనా గూఢచారిగా పనిచేస్తూ దేశ రహస్యాలను చైనాకు లీక్ చేస్తున్నాడు. అందుకోసం అతడికి, చైనాకు చెందిన మహిళకు పెద్ద ఎత్తున డబ్బులు అందుతున్నాయి. ఈ కేసుపై విచారణ జరుగుతుందని.. విచారణ క్రమంలో పూర్తి వివరాలు వెలుగుచూస్తాయని పోలీసులు తెలిపారు. కాగా రాజీవ్ శర్మను ముందుగా సెప్టెంబర్ 14న స్పెషల్ సెల్ పోలీసులు అరెస్టు చేసి.. సెప్టెంబర్ 15 కోర్టులో హాజరుపరిచారు. అతడిని ఆరు రోజుల పోలీస్ కస్టడీకి కోర్టు అప్పగించింది. (టిక్‌టాక్‌, వీచాట్‌ల బ్యాన్‌.. చైనా స్పందన)

మరిన్ని వార్తలు