ఢిల్లీ లిక్కర్ స్కాం.. అరుణ్‌ రామచంద్ర పిళ్లై ఈడీ రిపోర్టులో మరోసారి కవిత పేరు

7 Mar, 2023 16:54 IST|Sakshi

న్యూఢిల్లీ: డిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అరుణ్ రామచంద్ర పిళ్లై ఈడీ రిమాండ్ రిపోర్టులో మరోసారి ఎమెల్సీ కవిత పేరు వచ్చింది. ఆయన కవిత బినామీ అని, ఆమె ప్రతినిధినని ఎన్నోసార్లు స్టేట్‌మెంట్లు  ఇచ్చినట్లు రిమాండ్ రిపోర్టు పేర్కొంది.  కవిత ఆదేశాల మేరకే ఆయన పనిచేసినట్లు చెప్పింది.  ఇండో స్పిరిట్ స్థాపనలో రామచంద్ర పిళ్లైదే కీలక పాత్ర అని తెలిపింది.

కాగితాలపై రూ.3.5  కోట్లు పెట్టుబడి పెట్టినట్లు పిళ్లై చూపారని రిమాండ్ రిపోర్టులో ఉంది.  అందుకు ప్రతిఫలంగా కవిత ఆదేశాల మేరకు అరుణ్ పిళ్లైకు కోటి రూపాయలు  ఇ‍చ్చినట్లు తెలిపింది.  నేరపూరిత నగదు ప్రవాహం గురించి తెలుసుకునేందుకు ఆయనను ఇంటరాగేషన్ చేయాలని ఈడీ రిమాండ్‌ రిపోర్టు పేర్కొంది.   సౌత్ గ్రూప్ నుంచి రూ.వందల కోట్లు ఆప్ లీడర్లకు చెల్లించినట్లు పిళ్లై చెప్పారని తెలిపింది.

కాగా.. అరుణ్‌ రామచంద్ర పిళ్లైని ఈడీ ఇప్పటికే అరెస్ట్‌ చేసింది. ఇటీవలే ఆయనను రెండు రోజులపాటు ప్రశ్నించిన అధికారులు ఈక్రమంలోనే అదుపులోకి తీసుకున్నారు. ఈయన అరెస్టుతో ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో అరెస్ట్‌ అయిన వాళ్ల సంఖ్య 11కి చేరింది. ఈడీ కస్టడీలో ఉన్న రామచంద్రపిళ్లై స్టేట్‌మెంట్‌ను వీడియో రికార్డు చేయాలని కోర్టు ఆదేశించింది.

మరిన్ని వార్తలు