20 రూపాయిల కోసం దారుణం..

28 Sep, 2020 18:29 IST|Sakshi
రూ. 20 కోసం హత్యకు గురైన రూపేష్‌(ఫైల్‌ ఫోటో)

న్యూఢిల్లీ: రానురాను మనుషుల్లో మానవత్వం మచ్చుకైనా లేకుండా పోతుంది. చిన్న చిన్న విషయాలు కూడా తీవ్ర పరిణామాలకు దారి తీస్తున్నాయి. ఇలాంటి దారుణం ఒకటి దేశ రాజధానిలో చోటు చేసుకుంది. కేవలం 20 రూపాయలు ఇవ్వనందుకు ఓ వ్యక్తిని అతడి కుమారుడి కళ్ల ముందే దారుణంగా కొట్టి చంపేశారు కర్కోటకులు. వివరాలు.. రూపేష్‌(38) అనే వ్యక్తి ఉత్తర ఢిల్లీలోని బురారీ ప్రాంతంలో తన భార్య, కుమారుడితో కలిసి నివాసం ఉంటున్నాడు. ఈ ప్రాంతం ఘోరమైన నేరాలకు ప్రసిద్ధి చెందింది. ఈ క్రమంలో రూపేష్‌ కటింగ్‌ చేయించుకోవడం కోసం తన ఇంటి పక్కనే ఉన్న బార్బర్‌ షాప్‌కి వెళ్లాడు. యాభై రూపాయల బిల్లు అయ్యింది. రూపేష్‌ రూ.30 చెల్లించి మిగతా ఇరవై రూపాయలు తర్వాత ఇస్తా అన్నాడు. దాంతో ఆగ్రహించిన షాపు ఓనర్‌ తన సోదరుడితో కలిసి అతడిపై దాడి చేశాడు. (చదవండి: పోలీసు ఉన్నతాధికారి దారుణం : వైరల్ వీడియో)

ఈ దారుణం జరిగినప్పుడు రూపేష్‌ కుమారుడు అక్కడే ఉన్నాడు. దాడిని ఆపేందుకు ప్రయత్నించాడు. కానీ వారు ఆగలేదు. జనాలు చూస్తూ ఉన్నారు కానీ ఆపే ప్రయత్నం చేయలేదు. చివరకు అతడు మరణించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. నిందితులు సంతోష్‌, సరోజ్‌లను అరెస్ట్‌ చేశారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు