మార్ఫ్‌డ్‌ చిత్రాలతో.. 100 మంది మహిళలను

30 Dec, 2020 12:37 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

న్యూఢిల్లీ: మహిళల సోషల్‌ మీడియా అకౌంట్‌ ప్రొఫైల్‌ ఫోటోలను డౌన్‌లోడ్‌ చేసి.. వాటిని మార్ఫ్‌ చేసి.. ఇంటర్నెట్‌లో పెడతానని బెదిరిస్తూ డబ్బులు వసూలు చేస్తోన్న ఓ వ్యక్తిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్‌ చేశారు. వివరాలు.. నోయిడాకు చెందిన సుమిత్‌ ఝా(26) అనే వ్యక్తి మహిళల సోషల్‌ మీడియా అకౌంట్‌ నుంచి వారి ప్రొఫైల్‌ పిక్చర్స్‌ డౌన్‌లోడ్‌ చేసి వాటిని మార్ఫ్‌ చేసేవాడు. తర్వాత సేమ్‌ సోషల్‌ మీడియాలో ఫేక్‌ అకౌంట్‌ క్రియేట్‌ చేసి.. ఆ ఫోటోలను సదరు మహిళలకి పంపి.. అడిగినంత డబ్బు ఇవ్వాలని.. లేదంటే వాటిని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తానని బెదిరింపులకు దిగేవాడు. ఇలా దాదాపు 100 మహిళలను బ్లాక్‌మెయిల్‌ చేశాడు. ఈ క్రమంలో బ్యాంక్‌ మేనేజర్‌గా పని చేస్తున్న ఓ మహిళను కూడా బెదిరించేందుకు ప్రయత్నించాడు. ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేయడంతో మిగతా బాధితుల గురించి తెలిసింది. (చదవండి: ఉరితాడు కోసి.. ఊపిరి పోసి)

ఈ సందర్భంగా ఓ పోలీసాఫీసర్‌ మాట్లాడుతూ.. ‘నిందితుడు పోలీసులకు దొరకకుండా ఉండటం కోసం వాట్సాప్‌ ద్వారా వీఓఐపీ కాల్స్, వేరే యాప్స్‌ ద్వారా బెదిరింపులకు దిగేవాడు. ఇక సదరు బ్యాంక్‌ ఎంప్లాయ్‌ ఫిర్యాదుతో సర్వీస్‌ ప్రొవైడర్‌ రిపోర్ట్‌, సీక్రెట్‌ ఇన్‌ఫర్మేషన్‌ సేకరించి నిందితుడిని గుర్తించగలిగాము. మంగళవారం అతడిని అరెస్ట్‌ చేశాం ’ అని తెలిపారు. ఇక నిందితుడిని గతంలో ఇదే నేరం కింద చత్తీస్‌గఢ్‌, నోయిడాలో రెండు సార్లు అరెస్ట్‌ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. 

మరిన్ని వార్తలు