ఇద్దరూ ఒకే అమ్మాయిని ప్రేమించారు.. కత్తితో పొడిచి అతి కిరాతకంగా..

3 Jun, 2021 11:05 IST|Sakshi

న్యూఢిల్లీ: తండ్రి పుట్టినరోజును ఎంతో ఘనంగా సెలబ్రేట్‌ చేయాలనుకున్నాడు ఓ యువకుడు. కేక్‌ తీసుకొచ్చేందుకు బయటకు వచ్చాడు. అయితే అంతలోని కొందరు దుండగులు అతనిపై దాడి చేసి కత్తితో పొడిచి అతి కిరాతకంగా హత్య చేశాడు. ఈ ఘోర ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన దృశ్యాలన్నీ సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. దక్షిణ ఢిల్లీలోని అంబేద్కర్‌ నగర్‌లో తన తండ్రి బర్త్‌డే కోసం కేక్‌ కొనేందుకు 19 ఏళ్ల కునాల్‌ అనే యువకుడు రోడ్డు మీదకు వచ్చాడు. ఇంతలోనే ఓ నలుగురు వ్యక్తులు అతనిని చుట్టుముట్టి  దాడికి తెగబడ్డారు. బాధితుడి ఛాతీ, వీపు, పొత్తి కడుపులో పొడిచి హతమార్చారు. అనంతర అక్కడి నుంచి పరారయ్యారు.

రక్తపు మడుగులో పడి ఉన్న యువకుడిని ఆసుపత్రికి తరలించగా.. అంతలోనే  మరణించినట్లు వైద్యులు తెలిపారు. అయితే ఈ ఘటనపై కుటుంబ సభ్యలు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసుల నమోదు చేసి నలుగురు నిందితులను అరెస్టు చేశారు. కాగా ఓ యువతి విషయంలో వీరి మద్య తరుచూ గొడవలు జరుగుతున్నాయని పోలీసులు తమ విచారణలో తేలిందన్నారు. నిందితుడు గౌరవ్‌, బాధితుడు కునాల్‌ ఇద్దరూ ఒకే అమ్మాయిని లవ్‌ చేస్తున్నారని, దీంతో ఇద్దరి మధ్య శత్రుత్వం ఏర్పడిందన్నారు.  అనంతరం నిందితులు కునాల్‌పై కోపంతో దాడి చేసినట్లు పోలీసులు వెల్లడించారు. హత్యకు ఉపయోగించిన రెండు కత్తులను ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసినట్లు పోలీసులు తెలిపారు. నలుగురు నిందితులపై హత్యకేసు నమోదు చేసి దర్యాప్తుచేస్తున్నట్లు పేర్కొన్నారు.

చదవండి: సీఎంపై అసభ్యకర పోస్టులు పెట్టిన ఇద్దరు అరెస్టు
Cyber Crime: పిన్ని స్నానం చేస్తుండగా వీడియో తీసిన బాలుడు.. ఆపై

మరిన్ని వార్తలు