‘హాయ్‌ బేబీ’ అంటూ వలపు వల.. టెంప్ట్‌ అయ్యారా కొంప కొల్లేరే..!

16 Oct, 2021 21:42 IST|Sakshi

న్యూఢిల్లీ: సోష‌ల్ మీడియాలో యూజర్ల సంఖ్య పెరగడంతో సైబర్‌ కేటుగాళ్ల దీన్నే అదునుగా మార్చుకుని నెట్టింట ఇష్టారాజ్యంగా నేరాలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో కొందరు డబ్బు వస్తాయంటూ ఆశ చూపి మోసం చేస్తుండగా, మరికొందరు ఆన్‌లైన్‌లో ప‌రిచ‌యం పెంచుకుని కాస్త సన్నిహిత్యంగా మెలిగిన తర్వాత మన ఫోటోలను మార్ఫింగ్  చేసి‌ అభ్యంత‌ర‌క‌ర చిత్రాలు పంపి డ‌బ్బులు దండుకుంటున్నారు. అలాంటి ముఠా గుట్టును ఢిల్లీ పోలీసులు ర‌ట్టు చేశారు. 

పోలీసులు వివరాల ప్రకారం.. బాధితుడికి ఫేస్‌బుక్‌ అకౌంట్‌కి ఓ యువ‌తి పేరుతో ఫ్రెండ్ రిక్వెస్ట్ వ‌చ్చింది. ఇక ఆ రిక్వెస్ట్‌ను అంగీక‌రించ‌గానే కాస్త క్లోజ్‌గా మెలుగుతూ అతని వాట్సాప్ నెంబ‌ర్‌ను పంపాలని కోరడంతో బాధితుడు పంపాడు. కొన్ని రోజుల తర్వాత సదరు వ్యక్తి నుంచి అభ్యంత‌రక‌ర కంటెంట్‌తో ఉన్న వీడియో అతనికి వచ్చింది. ఏంటని చూడగా.. అందులో అడల్ట్‌ కంటెంట్‌ వీడియోని మార్ఫ్‌డ్ చేసి బాధితుడి ముఖాన్ని పెట్టారు. దీనీ​ చూసిన అతను షాక్‌కి గురయ్యాడు. ఆ వీడియో పంపిన తర్వాత నిందితుడు డ‌బ్బుల కోసం బెదిరింపులు మొదలుపెట్టాడు.

భయంతో బాధితుడు రూ.1,96,000 వరకు స‌మ‌ర్పించుకున్నాడు. ఇంకా పంపాలని బెదించగా బాధితుడి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన ఢిల్లీ పోలీసులు రాకెట్ గుట్టు ర‌ట్టు చేసి ఓ వ్య‌క్తిని అరెస్ట్ చేశారు. ఫిర్యాదుదారుకు కాల్ చేసేందుకు ఉప‌యోగించిన నెంబ‌ర్లు అస్సాంకు చెందిన‌విగా, వాటిని రాజ‌స్ధాన్‌లోని భ‌ర‌త్‌పూర్ జిల్లా నుంచి వాడిన‌ట్టు గుర్తించారు. నిందితుడు అరెస్ట్ చేసిన పోలీసులు మిగిలిన ముగ్గురు అనుమానితుల కోసం గాలిస్తున్నారు. వీరు ఫేస్‌బుక్ స‌హా సోష‌ల్ మీడియా వేదిక‌ల్లో యువ‌తుల పేరుతో ప‌రిచ‌యం పెంచుకుని బాధితుల‌ వద్ద డబ్బుల గుంజుకోవడమే ప‌నిగా పెట్టుకున్నార‌ని పోలీసులు దర్యాప్తులో తేలింది.

చదవండి: ఘోరం: ఇంట్లో ఒంటరిగా ఉన్న మైనర్‌పై.. కజిన్‌ అత్యాచారం

మరిన్ని వార్తలు