డెలివరీ బాయ్‌ ఘనకార్యం.. అశ్లీల చిత్రాలు, వీడియోలు

11 Oct, 2020 06:27 IST|Sakshi

సాక్షి, అమీర్‌పేట: యాప్‌ ద్వారా ఆన్‌లైన్‌లో ఆహార పదార్థాలను తెప్పించుకున్న ఓ మహిళకు మొబైల్‌ ఫోన్‌లో అశ్లీల సందేశాలు, చిత్రాలు పంపి వేధిస్తున్న డెలివరీ బాయ్‌పై ఎస్‌ఆర్‌నగర్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇన్‌స్పెక్టర్‌ సైదులు తెలిపిన మేరకు.. అమీర్‌పేట ఈస్ట్‌ శ్రీనివాస్‌నగర్‌ కాలనీకి చెందిన మహిళ గత నెల 31న మొబైల్‌ యాప్‌లోని రాపిడో బైక్‌ టాక్సీ ద్వారా ఫుడ్‌ ఆర్డర్‌ చేసింది. రవి అనే డెలివరీ బాయ్‌ వాటిని తీసుకువచ్చాడు.

ఇందుకు సంబంధించిన డబ్బును గూగుల్‌ పేద్వారా చెల్లించి నిర్ధారణ కోసం రవి సెల్‌ ఫోన్‌కు స్క్రీన్‌ షాట్‌ పంపింది. మూడు రోజుల తరువాత రవి సదరు మహిళ ఫోన్‌కు అశ్లీల చిత్రాలు, వీడియోల సందేశాలను పంపడం ప్రారంభించాడు. దీంతో ఆమె నంబరును బ్లాక్‌ చేసింది. అయినా మరో సెల్‌ నంబర్‌ ద్వారా వేధించగసాగాడు. బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న రవి కోసం గాలిస్తున్నారు. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు