రూ. 200 కోసం తండ్రిని చంపేశాడు!

22 Jul, 2021 02:33 IST|Sakshi

మతిస్థిమితం లేని కొడుకు ఘాతుకం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఘటన  

సాక్షి, కొత్తగూడెం టౌన్‌: మద్యం తాగేందుకు రూ.200 ఇవ్వడానికి నిరాకరించడంతో ఓ మతిస్థిమితం లేని వ్యక్తి తన తండ్రిని రోకలి బండతో మోది హత మార్చాడు. భద్రాద్రి జిల్లా కొత్తగూడెంలో ఈ ఘటన జరిగింది. పట్టణంలోని హనుమాన్‌ బస్తీకి చెందిన కొమరయ్య పది నెలల క్రితం మెడికల్‌ అన్‌ఫిట్‌తో ఉద్యోగ విరమణ చేశారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

చిన్న కుమారుడు శివప్రసాద్‌ మతిస్థిమితం లేకుండా తిరుగుతుంటాడు. మద్యం తాగేందు కు డబ్బులు ఇవ్వాలని రోజూ తండ్రిని వేధించేవాడు. ఇటీవల కొమరయ్యకు రిటైర్‌మెంట్‌ డబ్బులు రావడం తో ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి. బుధవారం ఉదయం నిద్రలేచిన తండ్రిని మద్యం తాగేందుకు రూ.200 ఇవ్వాలని శివప్రసాద్‌ కోరాడు. దీంతో రోజూ తాగడం ఏంటని కొమరయ్య ప్రశ్నించడంతో, శివ ప్రసాద్‌ ఆగ్రహంతో ఊగిపోతూ రోకలి బండ తో తండ్రి తలపై కొట్టడంతో రక్తం స్రావమై అక్కడికక్కడే మృతి చెందాడు. ఆ వెంటనే భయంతో శివప్రసాద్‌ పారిపోయాడు.  

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు