కన్నబిడ్డ హత్యకు వరుస ప్లాన్‌లు.. కసాయి తల్లిపై విచారణ

7 Aug, 2022 08:22 IST|Sakshi

సాక్షి, బెంగళూరు: నగరంలో సంపంగిరామనగర సీకేసీ గార్డెన్‌ అద్విత్‌ అపార్టుమెంటులో నాలుగో అంతస్తు నుంచి ఐదేళ్ల బిడ్డను కిందకు విసిరేసి హత్య చేసిన తల్లి, దంత వైద్యురాలు సుష్మాపై విచారణ సాగుతోంది. బిడ్డకు మానసిక వైకల్యం అనే కారణంతోనే  తల్లి నాలుగో అంతస్తు నుంచి పడేసిందని, హత్య కేసు నమోదు చేసి తల్లి సుష్మాను అరెస్ట్‌ చేసినట్లు సెంట్రల్‌ డీసీపీ శ్రీనివాసగౌడ శనివారం తెలిపారు.


బిడ్డను విసిరేస్తున్న దృశ్యం, నిందితురాలు సుష్మా 

భార్య చేసిన హత్యను సీసీ కెమెరాల్లో చూసిన భర్త కిరణ్‌ కన్నీరు మున్నీరుగా విలపించాడు. ఆమెకు బిడ్డ భారమనిపించి ఉంటే నేనే పోషించేవాడనని చెప్పాడు. కిరణ్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు భార్య సుష్మాపై ఎస్‌ఆర్‌ నగర పోలీసులు కేసు నమోదు చేశారు. గతంలో కూడా బిడ్డను వదిలించుకోవాలని రైల్లో వదిలేసి వచ్చింది. అయితే ఒక ఎన్‌జిఒ సభ్యులు గాలించి కుటుంబానికి అప్పగించారు. చిన్నారిని అంతమొందించాలని అనేకసార్లు ప్రయత్నాలు చేసిందని విచారణలో తేలింది.  
చదవండి: మరో మహిళతో భర్త వివాహేతర సంబంధం.. భార్యకు వేధింపులు

2017లోనూ ఇదే మాదిరి ఘటన  
కాగా, 2017లో బెంగళూరు జేపీ నగరలో సరిగ్గా ఇటువంటి సంఘటనే జరిగింది. స్వాతి సర్కార్‌ అనే ప్రైవేటు స్కూల్‌ టీచర్‌.. తన కూతురు శ్రేయ సర్కార్‌ మానసిక వైకల్యంతో బాధపడుతోందని విరక్తి చెంది పాపను నాలుగో అంతస్తు నుంచి రెండుసార్లు కిందకు పడవేయడంతో పాప చనిపోయింది. తరువాత స్థానికులు ఆ తల్లిని పట్టుకుని కరెంటు స్తంభానికి కట్టేసి చావబాదారు. ఆ తల్లికి మతిస్థిమితం లేదని తేలింది.

మరిన్ని వార్తలు