మహిళా పోలీసుకు డిప్యూటీ తహసీల్దార్‌ లైంగిక వేధింపులు

31 Jan, 2022 10:41 IST|Sakshi

సాక్షి, తిరువొత్తియూరు(తమిళనాడు): ఊటీలో మహిళా పోలీసుకు లైంగిక వేధింపులు ఇచ్చిన డిప్యూటీ తహసీల్దార్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఊటీ జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో బాబు (35) డిప్యూటీ తహసీల్దారుగా పని చేస్తున్నాడు. ప్రస్తుతం స్థానిక ఎన్నికలు జరగనున్న క్రమంలో ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ విధులు నిర్వహిస్తున్నాడు. అతనికి సాయంగా ఓ మహిళా పోలీసు సహా ఇద్దరు పోలీసులను కేటాయించారు.

మగ కానిస్టేబుల్‌ వాహనాలను తనిఖీ చేయమని చెప్పి ఒంటరిగా ఉన్న మహిళా పోలీసును డిప్యూటీ తహసీల్దారు లైంగిక వేధించినట్లు తెలిసింది. ఆమె దీనిని ఖండించారు. అయినప్పటికీ తీరు మార్చుకోకపోవడంతో బాధితురాలు ఊటీలో ని మహిళా పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. విచారణలో నిందితుడు అసభ్యంగా ప్రవర్తించినట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో పోలీసులు డిప్యూటీ తహసీల్దారును అరెస్టు చేశారు.  

చదవండిః ఇంటిపని అని చెప్పి.. వ్యభిచార కూపంలోకి దింపారు

మరిన్ని వార్తలు