వైఎస్సార్‌ విగ్రహం ధ్వంసం

5 May, 2022 03:59 IST|Sakshi
విగ్రహాన్ని పునఃప్రతిష్టిస్తున్న ఎమ్మెల్యే అలజంగి జోగారావు

పార్వతీపురం మన్యం జిల్లా కృష్ణపల్లిలో జనసేన కార్యకర్త దురాగతం 

ఎమ్మెల్యే జోగారావు చొరవతో విగ్రహం పునఃప్రతిష్ట

సాక్షి, పార్వతీపురం: పార్వతీపురం మన్యం జిల్లాలోని పార్వతీపురం మండలం కృష్ణపల్లి గ్రామ ప్రధాన రహదారి పక్కనే ఉన్న దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్‌ విగ్రహాన్ని గోపాలపురం గ్రామానికి చెందిన జనసేన కార్యకర్త బోనెల చంటి బుధవారం ధ్వంసం చేశాడు. మండపంపై నుంచి విగ్రహాన్ని పెకిలించి రోడ్డుమీద ఈడ్చుకెళ్లేందుకు ప్రయత్నించాడు. అతడిని పంచాయతీ వార్డుసభ్యుడు కోనపురెడ్డి శ్రీనివాసరావు, గ్రామస్తులు అడ్డుకున్నా రు. చంటికి దేహశుద్ధి చేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ విషయం తెలిసిన వెంటనే అక్కడికి చేరుకున్న పార్వతీపురం ఎమ్మెల్యే అలజంగి జోగారావు.. సర్పంచ్‌ బోను రామినాయుడితో పాటు గ్రామపెద్దలతో మాట్లాడారు.

వైఎస్సార్‌ విగ్రహాన్ని ధ్వంసం చేసి లాక్కెళుతున్న చంటి, నిందితుడు చంటి 

తొలగించిన విగ్రహాన్ని వెంటనే పునఃప్రతిష్టించారు. పూలమా లలు వేసి నివాళులర్పించారు. అనంతరం మీడియాతో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ ఘటన వెనుక చాలా అనుమానా లున్నాయని చెప్పారు. ఎవరైనా చేయించి ఉండవచ్చన్నారు. నింది తులను కఠినంగా శిక్షించాలని, ఇటు వంటి ఘటనలు పునరావృతం కాకుం డా చూడాలని పోలీసులను కోరారు. డీఎస్పీ సుభాష్, సీఐ విజయానంద్, పార్వతీపురం రూరల్‌ ఎస్‌ఐ వై.సింహాచలం ఘటనా స్థలాన్ని పరిశీలించారు. వార్డు సభ్యుడు శ్రీనివాసరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి చంటిని అదుపులోకి తీసుకున్నారు. అతడిపై 153ఎ, 427, 109 సెక్షన్లతో కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడి ఫోన్‌కాల్‌ లిస్టుపై ఆరా తీస్తున్నారు. 

మరిన్ని వార్తలు