డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ ఉత్తుత్తి గృహ రుణాలు..

25 Mar, 2021 00:35 IST|Sakshi

కల్పిత ఖాతాల సృష్టి

సీబీఐ కేసు నమోదు

న్యూఢిల్లీ: లబ్ధిదారులతో సంబంధం లేకుండా ఉత్తుత్తి (కల్పిత) గృహ రుణ ఖాతాలను సృష్టించి వాటిపై ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన పథకం (పీఎంఏవై) సబ్సిడీలను డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ కంపెనీ మింగేసినట్టు బయటపడింది. ఇందుకు సంబంధించి డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ కంపెనీ, డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ ప్రమోటర్లు అయిన కపిల్‌ వాధ్వాన్, ధీరజ్‌ వాధ్వాన్, డైరెక్టర్లపై కేసు నమోదు చేసింది. డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ ఖాతాలను ఫోరెన్సిక్‌ ఆడిట్‌ చేసిన గ్రాంట్‌ థార్న్‌టన్‌ సంస్థ ఈ మోసాలను వెలుగులోకి తీసుకొచ్చింది. డీహెచ్‌ఎఫ్‌ఎల్‌   ముంబైలోని బాంద్రాలో కల్పిత శాఖను ఏర్పాటు చేయడమే కాకుండా.. అప్పటికే గృహ రుణాలు తీసుకుని చెల్లించేసిన రుణ ఖాతాలను ఉత్తుత్తి శాఖలోని డేటాబేస్‌లో చేర్చింది. 2007–19 మధ్య ఇందుకు సంబంధించి 2.60 లక్షల నకిలీ ఖాతాలను సృష్టించి రూ.14,046 కోట్ల రుణాలను మంజూరు చేసినట్టు చూపింది. రూ.11,756 కోట్లను ఇలా దారిమళ్లించినట్టు బయటపడింది.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు