దీక్షిత్‌ను హత్య చేసిన నిందితుల ఎన్‌కౌంటర్‌?

22 Oct, 2020 11:09 IST|Sakshi

 నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేసినట్లు పుకార్లు

సాక్షి, మహూబూబాబద్‌: నగరానికి చెందిన తొమ్మిదేళ్ల బాలుడు దీక్షిత్‌ని అపహరించి హత్య చేసిన నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేసినట్లు పుకార్లు వచ్చాయి. కిడ్నాపర్లు మనోజ్‌రెడ్డి, మందసాగర్‌ను పోలీసులు కాల్చిచంపినట్లు ప్రచారం జరిగింది. కానీ జిల్లా ఎస్పీ కోటిరెడ్డి మీడియా సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించకపోవడంతో అవి ఒట్టి పుకార్లే అని తెలిపోయింది.  కాగా, మహబూబాబాద్‌ కృష్ణా కాలనీకి చెందిన రంజిత్‌, వసంత దంపతుల పెద్ద కుమారుడు దీక్షిత్‌రెడ్డి ఇంటి ముందు ఆడుకుంటుండగా గత ఆదివారం సాయంత్రం రంజిత్‌ బంధువు కుసుమ మనోజ్‌రెడ్డి కిడ్నాప్‌ చేశాడు. అనంతరం మందసాగర్‌ అనే వ్యక్తితో కలిసి కేసముద్రం మండలం అన్నారం దానమయ్య గుట్టపై బాలుడిని హత్యచేసి పెట్రోల్‌ పోసి మృతదేహాన్ని కాల్చేశారు. (చదవండి : అయ్యో పాపం.. దీక్షిత్‌ను చంపేశారు )

ఆ తర్వాత బాలుడి తల్లికి ఫోన్‌ చేసి  రూ.45 లక్షలు ఇస్తే తమ బాలుడిని విడిచిపెడతామన్నారు. విషయాన్ని ఎవరికి  చెప్పవద్దని హెచ్చరించారు. పోలీసులకు కంప్లైంట్ చేయవద్దని, బాలుడి ఇంటి పరిసర ప్రాంతాల్లో తమ వ్యక్తులు ఉన్నారని బెదిరించారు. మంగళవారం రాత్రి కిడ్నాపర్లు మరోసారి ఫోన్‌ చేసి డబ్బులు రెడీ అయ్యాయా, బుధవారం ఉదయం ఫోన్‌ చేస్తాం అని చెప్పారు. చెప్పినట్లుగానే బుధవారం ఉదయం ఫోన్‌ చేసిన కిడ్నాపర్లు డబ్బు సిద్ధం చేసుకోండి, బ్యాగులో డబ్బు పెడుతున్నప్పుడు వీడియో కాల్‌ చేస్తే తమకు చూపించాలని చెప్పినట్లు సమాచారం. అన్నట్లుగానే మధ్యాహ్నం 12 గంటలకు కిడ్నాపర్లు వీడియో కాల్‌ చేయగా, బాలుడి తల్లిదండ్రులు డబ్బు చూపించారు. దీంతో కిడ్నాపర్‌ జిల్లా కేంద్రంలోని మూడు కొట్ల చౌరస్తా వద్ద డబ్బు బ్యాగ్‌తో ఉండాలని,, వచ్చి తీసుకుంటామని చెప్పారు. దీంతో బాలుడి తండ్రి మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు డబ్బుతో ఎదురుచూశారు. ఆ సమయంలోనే పోలీసులు మాటువేసి నిందితులను అదుపులోకి తీసుకొని ఎన్‌కౌంటర్‌ చేసినట్లు ప్రచారం జరిగింది. [ చదవండి : ఆర్ఆర్ఆర్‌ టీజ‌ర్‌: ఇవ‌న్నీ ఇప్ప‌టికే చూసేశాం, ఆ అగ్నిప‌ర్వ‌తం ఆ ఛాన‌ల్‌లోదే ]

మరిన్ని వార్తలు