దీక్షిత్‌ హత్య: అంతా ఆ ఒక్కడే!

23 Oct, 2020 13:06 IST|Sakshi

సాక్షి, మహబూబాబాద్ : నగరానికి చెందిన తొమ్మిదేళ్ల బాలుడు దీక్షిత్‌రెడ్డి కిడ్నాప్, హత్య కేసు నిందితుడు మంద సాగర్‌ను పోలీసులు శుక్రవారం మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఎస్పీ కోటి రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ‘‘దీక్షిత్‌ను కిడ్నాప్ చేసిన 2 గంటల వ్యవధిలోనే కిడ్నాపర్ సాగర్ హత్య చేశాడు.  బాలుడికి ముందుగా నిద్రమాత్రలు ఇచ్చి, కర్చీఫ్‌తో చేతులు కట్టి.. చిన్నారి టీషర్ట్‌తోనే మెడకు ఉరి బిగించి చంపాడు. ఆ హత్య తర్వాతే బాలుడి తల్లిదండ్రులనుంచి 45 లక్షలు డిమాండ్ చేశాడు.

నిందితుడు సాగర్ బాలుడిని హత్య చేసిన చోట నుంచే డబ్బుల కోసం దీక్షిత్‌ తల్లిదండ్రులకు ఫోన్ చేశాడు. 45 లక్షల రూపాయలు ఇవ్వకపోతే దీక్షిత్‌ను చంపేస్తానని బెదిరించాడు. ఇంటర్‌నెట్ కాల్స్ అవ్వటం వల్ల వెంటనే ఫోన్ కాల్‌ ట్రేస్‌ చేయలేకపోయాం. హైదరాబాద్, వరంగల్‌ సైబర్ క్రైమ్ ఇంటెలిజెన్స్‌ విభాగాల్లో పనిచేసిన.. ఎక్స్‌పర్ట్‌ ద్వారా సాగర్ ఫోన్ కాల్స్‌ను ట్రేస్ చేశాం. బాలుడిని హత్య చేసిన తర్వాత పెట్రోల్ పోసి తగులబెట్టాడు. మంద సాగర్ ఒక్కడు మాత్రమే ఈ హత్యలో పాల్గొన్నాడు. మిగితా వారికి ఎలాంటి సంబంధం లేద’’ని తెలిపారు. ( కంగనాపై మరో కేసు నమోదు..)

రిమాండ్‌ రిపోర్టులో కీలక విషయాలు
దీక్షిత్‌ రెడ్డి కిడ్నాప్‌ అండ్‌ మర్డర్‌ కేసు రిమాండ్‌ రిపోర్టులో పలు కీలక విషయాలు వెలుగు చూశాయి. నిందితుడు సాగర్‌ సంవత్సరం నుండి డింగ్ టాక్ వాయిస్ ఓవర్ ఇంటర్ నెట్ ప్రోటోకాల్ యాప్‌ను వాడుతున్నాడు. తన గర్ల్ ఫ్రెండ్‌కు ఫోన్ చేసేందుకు ఈ యాప్‌ను సంవత్సరం నుండి  ఉపయోగిస్తున్నాడు. ఈ యాప్ ద్వారా బాలుడి తల్లిదండ్రులకు ఫోన్ చేశాడు. మొబైల్ నెంబర్ ద్వారా కాకుండా యాప్ ద్వారా కాల్స్ చేయటంతో బాలుడి ఆచూకీ కనుక్కోవటం పోలీసులకు 3 రోజులు పాటు సవాలుగా మారింది. పెట్రోల్ బంక్ వద్దకు వెళదామని చెప్పి బాలుడిని తన ద్విచక్ర వాహనంపై ఎక్కించుకున్నాడు సాగర్‌. తెలిసిన వ్యక్తి కావడంతో పిలవగానే దీక్షిత్‌ అతడి బైక్‌ ఎక్కాడు.

అప్పటికే స్థానిక మెడికల్ స్టోర్ నుండి సాగర్‌ రెండు నిద్రమాత్రలు కొనుగోలు చేశాడు. మార్గం మధ్యలో ఒక చోట మంచినీళ్లు తాగెందుకు ఆపాడు. ఆ మంచి నీళ్లలోనే నిద్రమాత్రలు వేశాడు. బాబు మత్తులోకి జారుకుని, స్పృహలోకి వచ్చేలోపే బాలుడిని హత్య చేశాడు. అనంతరం వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ ద్వారా బాలుడి తల్లిదండ్రులకు ఫోన్ చేసి డబ్బులు డిమాండ్‌ చేశాడు. ఒక చౌరస్తా దగ్గరికి బాలుడి తండ్రిని రమ్మని చెప్పి షాపులో నుండి రంజిత్ రెడ్డి కదలికలను గమనించాడు. మఫ్టీలో పోలీసులు ఫాలో అవుతున్నారన్న అనుమానంతో మళ్లీ యాప్ నుండి రంజిత్ రెడ్డికి ఫోన్ చేశాడు. హత్య చేసిన వెంటనే మనోజ్ రెడ్డి ఇంటికి బాలుడి తలిదండ్రుల రియాక్షన్ చూసేందుకు వెళ్లాడు.

మరిన్ని వార్తలు