భార్యాభర్తల గొడవ.. అడ్డుకోబోయిన ఎస్‌ఐపై దాడి

24 Nov, 2021 08:21 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

గౌరిబిదనూరు(బెంగళూరు): పోలీస్‌స్టేషన్‌ వద్ద ఇరుకుటుంబాల గొడవలో ఎస్‌ఐపై దాడి జరిగింది. పట్టణానికి చెందిన ప్రైవేటు ఉద్యోగి మహమ్మద్‌ సిద్దికి కు మాలూరు తాలూకాకు చెందిన వీఏఓ ఉస్నా ఖానంతో మూడు నెలల క్రితం పెళ్లయింది. గొడవలు జరగడంతో స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదులు చేసున్నారు.

ఆదివారం సాయంత్రం ఎస్‌ఐ చంద్రకళతో మాట్లాడి కట్నకానుకలను వెనక్కి ఇవ్వడానికి ఒప్పుకున్నారు. స్టేషను బయటకు రాగానే ఉస్మాఖానం బంధువులు, సిద్దికిపై దాడి చేశారు. అడ్డుకోబోయిన ఎస్‌ఐ చంద్రకళకు స్వల్పంగా దెబ్బలు తగిలాయి. లాఠీ ఛార్జి చేయడంతో ఇరువర్గాలు శాంతించాయి.  ఉస్నా ఖానం వైపు వారిపై కేసు దాఖలు చేయడమైంది.

చదవండి: Viral: అసలేం జరిగింది.. నెల రోజులుగా జీడి చెట్టుకు వేలాడుతున్న మృతదేహం ?

మరిన్ని వార్తలు