'హోంమంత్రి భ‌రోసాతో ధైర్యంగా అనిపిస్తుంది'

17 Oct, 2020 18:46 IST|Sakshi

విజయవాడ :  సీఎం వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి మ‌హిళల కోసం ఎన్నో ప‌థ‌కాలు తెచ్చార‌ని, దివ్య‌ను హ‌త్య‌చేసిన ఉన్మాదిని శిక్షించి న్యాయం చేయాల‌ని ఆమె త‌ల్లి కుసుమ విన్న‌వించుకున్నారు.  స్వ‌యంగా రాష్ర్ట హోం మంత్రే త‌మ ఇంటికి రావ‌డంతో భరోసాగా ఉందని దివ్య తండ్రి జోసెఫ్ అన్నారు. కోర్టుల చుట్లూ తిర‌గ‌లేక ఆత్మ‌హ‌త్య చేసుకోవాల‌నుకున్న త‌మ‌కు హోంమంత్రి భ‌రోసా ఇవ్వ‌డం చాలా ధైర్యంగా అనిపిస్తుంద‌న్నారు. త‌మ కుమార్తెకు న్యాయం జ‌రిగేలా మంత్రి భరోసా ఇచ్చార‌ని తెలిపారు. (సైకోలా వేధిస్తున్నాడని దివ్య వీడియోలో చెప్పింది)

 తాను సీఎం వైఎస్ జ‌గ‌న్‌కు వీరాభిమానిన‌ని , త‌న చెల్లికి  త‌క్ష‌ణమే  న్యాయం జ‌రుగుతుంద‌ని భావిస్తున్నా అని  దివ్య సోద‌రుడు దినేష్ అన్నారు. ఈ ఘ‌ట‌న‌ను సామాజిక దారుణంగా చూడాల‌ని, ఇంట్లో ఉన్నా ర‌క్ష‌ణ లేక‌పోవ‌డం అన్న‌ది సీరియ‌స్‌గా తీసుకోవాల్సిన విష‌య‌మ‌న్నారు. దేశంలో ప్ర‌తీ రెండు రోజుల‌కు ఎక్క‌డో చోట ఇలాంటి దారుణాలు జ‌రుగతూనే ఉన్నాయ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. (అందుకే ఆమెను చంపి నేనూ చనిపోవడానికి సిద్ధపడ్డా! )

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు