నాగేంద్ర అరెస్ట్‌కు కౌంట్‌డౌన్‌ మొదలు

27 Oct, 2020 14:18 IST|Sakshi

సాక్షి, విజయవాడ : ఇంజనీరింగ్‌ విద్యార్థిని దివ్య తేజస్విని హత్య కేసులో నిందితుడు నాగేంద్ర అరెస్ట్‌కు కౌంట్ డౌన్ మొదలైంది. 45 మందిని విచారించిన పోలీసులు వారం క్రితమే ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసారు. అరెస్ట్‌కు వైద్యపరమైన చిక్కులు ఎదురవడంతో ఆటంకం ఏర్పడింది. వైద్యుల నుంచి సానుకూల సంకేతాలు వచ్చే అవకాశం ఉండటంతో అరెస్టుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ మేరకు డీసీపీ హర్షవర్ధన్‌ సాక్షి టీవీతో మాట్లాడారు. వైద్యులు క్లారిటీ ఇచ్చిన వెంటనే నాగేంద్రను అదుపులోకి తీసుకొని కోర్టులో హాజరు పరుస్తామని ఆయన వెల్లడించారు. కస్టడీకి తీసుకొని హత్యకు గల కారణాలు రాబడతామని డీసీపీ పేర్కొన్నారు. చదవండి: ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ అవగానే అరెస్ట్

చదవండి: దివ్యది హత్యే.. తేల్చిన పోలీసులు

మరిన్ని వార్తలు