మానవత్వం లేకపోతే ఎలా?

30 Sep, 2020 08:52 IST|Sakshi

సాక్షి, కరీంనగర్‌: కరీంనగర్‌ కార్ఖానగడ్డలోని మహతి ఆసుపత్రిలో ఇటీవల రోడ్డు ప్రమాదంలో కాలు విరిగిన పేషెంట్‌కు వైద్యం చేయగా వికటించిన ఘటనపై డీఎంహెచ్‌వో విచారణ ప్రా రంభించారు. హాస్పిటల్‌ యాజమాన్యాన్ని మంగళవారం తన కార్యాలయానికి పిలిపించారు. ప్రజారోగ్యాన్ని కాపాడుతామని ఆసుపత్రిని ఏ ర్పాటు చేశారు.. కనీస మానవత్వం లేకపోతే ఎలా.. రూ.2లక్షలకు పైగా బిల్లు వేసి, వైద్యం వి కటించి, పేషెంట్‌కు ఇన్‌ఫెక్షన్‌ వస్తే పట్టించుకోక పోవడం ఏంటని మండిపడ్డారు. ఇష్టానుసారంగా బిల్లులు వేస్తే నిరుపేదలు ఆస్తులు అమ్ముకొ ని, చెల్లించాలా అంటూ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము కొత్తగా ఆసుపత్రిని తీసుకున్నామని నిర్వాహకులు తెలుపగా గతంలో ఉన్న మే నేజ్‌మెంట్‌ మారినప్పుడు వైద్యాధికారుల అనుమతి లేకుండా హాస్పిటల్‌ ఎలా నిర్వహిస్తారని డీఎంహెచ్‌వో ప్రశ్నించారు. బాధితుడు, రేకుర్తికి చెందిన రంగయ్యది రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబమని, ఇంత బిల్లు ఎలా వేశారని ప్రశ్నించారు.

ఆసుపత్రిని వైద్యేతరులు నడిపించడం పట్ల అసహనం వ్యక్తం చేశారు. దీనిపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి, ఆసుపత్రి యాజమాన్యంపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆసుపత్రిలో కోవిడ్‌–19 చికిత్సకు అనుమతి పొంది, నిబంధనలు పాటించడం లేదని, అన్ని వివరాలతో మరోసారి హాజరు కావాలని ఆదేశించారు. త్వరలోనే ఆసుపత్రిని సందర్శించి, పూర్తిస్తాయిలో విచారణ చేపడుతామన్నారు. కాగా తమను ఆర్థికంగా, ఆరోగ్యపరంగా నష్టపరిచిన మహతి హాస్పిటల్‌ యాజమాన్యంపై చర్యలు తీసుకొని, న్యాయం చేయాలని రంగయ్య కుటుంబీకులు కోరుతున్నారు. 

వివాహిత ఆందోళన
ఇబ్రహీంపట్నం(కోరుట్ల): గోధూర్‌లో భర్త విడాకులు ఇవ్వకుండానే మూ డో పెళ్లి చేసుకున్నాడని ఓ వివాహిత అతని ఇంటి ఎదుట బైఠాయించింది. ఏఎస్సై సత్యనారాయణ వివరాల ప్రకారం.. మెట్‌పల్లి మండలం మెట్లచిట్టాపూర్‌కు చెందిన ఆరీఫాకు గోధూర్‌కు చెందిన సల్మాన్‌తో వివాహం జరిగింది. కొన్ని నెలలు బాగానే ఉన్న సల్మాన్‌ ఆ తర్వాత ఆమెను చిత్రహింసలు పెట్టడంతో పుట్టింటికి చేరింది. అతనిపై మెట్‌పల్లి  ఠాణా లో ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో సల్మాన్‌ రెండో వివాహం చేసుకున్నాడు. ఆమెను కూడా వేధించడంతో వెళ్లిపోయింది. మళ్లీ ఈ నెల 11న మూడో పెళ్లి చేసుకున్నాడు. తనకు విడాకులు ఇవ్వకుండానే భర్త పెళ్లిళ్ల మీద పెళ్లిళ్లు చేసుకుంటున్నాడని, న్యాయం చేయాలని ఆరీఫా మంగళవారం భర్త ఇంటి ఎదుట నిరసనకు దిగింది. ఏఎస్సై  సంఘటన స్థలానికి చేరుకున్నారు. న్యాయం చేస్తామని, ప్రస్తుతం భర్త ఇంటిలోనే ఉండాలని సూచించచడంతో ఆందోళన విరమించింది 

దొంగపై పీడీయాక్టు అమలు  
సాక్షి, రామగుండం క్రైం: గోదావరిఖని వన్‌ టౌన్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో మైనర్‌ బాలురను చేరదీసి, దొంగతనాలకు పాల్పడుతున్న పెంకి బలరాం(23)పై పీడీయాక్టు నమోదు చేసినట్లు సీ ఐలు పర్శ రమేష్, రాజ్‌కుమార్‌గౌడ్‌లు మంగళవారం తెలిపారు. సంబంధిత ఉత్తర్వులను కరీంనగర్‌ జిల్లా జైలులో ఉన్న నిందితుడికి జైలు అధికారుల సమక్షంలో అందించామని, అనంతరం వరంగల్‌ కేంద్ర కారాగారానికి తరలించి నట్లు పేర్కొన్నారు.  ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం రూరల్‌ ఆగంపుడికి చెందిన బలరాంకు భా ర్య ఉండగా మూడేళ్లుగా గోదావరిఖని విఠల్‌నగర్‌లో ఓ అద్దె ఇంట్లో ఉంటున్నాడు. మైనర్‌ బా లురతో కలిసి 2019 నుంచి ఇప్పటివరకు రామగుండం పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో 6 ఘటనల్లో రూ.10 లక్షల విలువైన ఆభరణాలు, ఎలక్ట్రానిక్‌ వస్తువులు దొంగిలించాడు. వరుస దొంగతనాలు చేస్తున్న బలరాంపై పీడీయాక్టు అమలుకు కృషి చేసిన ఏసీపీ ఉమేందర్, సీఐలను సీపీ సత్యనారాయణ అభినందించారు.  

మరిన్ని వార్తలు