మాజీ ఎంపీ మనవడి హత్య 

14 Sep, 2021 08:06 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

తిరువొత్తియూరు: నామక్కల్‌ సమీపంలో డీఎంకే మాజీ ఎంపీ మనవడిని హత్య చేసిన నలుగురు నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. వివరాలు.. నామక్కల్‌ జిల్లా సేందమంగళం సమీపం బేలకురిచ్చి వాసి జేపీఎస్‌ సోమసుందరం. డీఎంకేకు చెందిన ఇతను రెండుసార్లు రాజ్యసభ ఎంపీగా పనిచేశారు. ఈయన మనవడు రాజేంద్రన్‌ (52) రైతు. బేలకురిచ్చిలో నివాసముంటున్నాడు. అతని భార్య సుగుణ (45). ఇద్దరు పిల్లలకు వివాహం కావడంతో ఈ దంపతులు ఒంటరిగా ఉంటున్నారు. ఈ క్రమంలో ఆదివారం అర్ధరాత్రి రాజేంద్రన్‌ ఇంటికి వచ్చిన నలుగురు దుండగులు తలుపు కొట్టారు. అతను బయటకు రావడంతో కత్తులతో దాడి చేసి పారిపోయారు. రాజేంద్రన్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. బేలకురిచ్చి ఎస్పీ సరోజ్‌ కుమార్‌ ఠాగూర్, రాసిపురం డీఎస్పీ సెంథిల్‌ కుమార్, బెలచ్చేరి ఇన్‌స్పెక్టర్‌ శివ శంకర్‌ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. రాజేంద్ర మృతదేహాన్ని పోస్టుమారా్టనికి తరలించి నిందితుల కోసం గాలిస్తున్నారు. 

అన్నను హత్య చేసిన తమ్ముడు అరెస్ట్‌ 
తిరువారూరు జిల్లా వలంగై మాన్‌ సమీపం నల్లూరుకు చెందిన రోజాపతికి కార్తీక్‌ (31), ప్రశాంత్‌ (29), వినోద్‌ (27)అనే  కుమారులు ఉన్నారు. వినోద్‌ ఓ యువతిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. దీంతో కార్తీక్‌ తనకు ఎందుకు ఇంకా వివాహం చేయలేదని తల్లితో గొడవ పడ్డాడు. కార్తీక్‌ తీరును ఖండించే క్రమంలో వినోద్‌ కత్తితో అన్నపై దాడి చేయడంతో అతడు మరణించాడు. వినోద్‌ను పోలీసులు అరెస్టు చేశారు.

>
మరిన్ని వార్తలు