ఆస్పత్రిలో గర్భిణీ మృతి.. అవమానం తట్టుకోలేక మహిళా వైద్యురాలు

30 Mar, 2022 12:22 IST|Sakshi

జైపూర్‌: కొన్ని సంఘటనలు చాలా విచిత్రంగా ఉంటాయి. డాక్టర్లు పేషెంట్లను రక్షించాలనే అనుకుంటారు. అయితే ఒక్కోసారి అనూహ్య పరిణామాల వల్ల ఒక పెషంట్‌ చనిపోతే దానికి వైద్యుడే కారణం అంటూ ఆరోపణలు చేస్తుంటారు. నిజానికి వైద్యుడి నిర్లక్ష్యం ఎంతో ఉందో చెప్పలేం గానీ ఆ సమయంలో పేషెంట్‌ పరిస్థితి గురించి కూడా ఆలోచించాల్సి ఉంటుంది. కానీ ఇలాంటి అరుదైన సంఘటన కారణంగా సున్నితమైన వైద్యులు ఈ అవమానాన్ని భరించలేక ఆత్మహత్య చేసుకున్న సందర్భాలు అనేకం. అచ్చం అలాంటి ఘటనే రాజస్థాన్‌లో చోటు చేసుకుంది.

వివరాల్లోకెళ్తే...పోలీసులు కథనం ప్రకారం...రాజస్థాన్‌లోని దౌసా జిల్లాలో ఓ ప్రైవేట్‌ ఫెసిలిటీలో గర్భిణి మృతి చెందింది. ఆ ఆస్పుత్రిని డాక్టర్ అర్చన శర్మ, ఆమె భర్త కలిసి నిర్వహిస్తున్నారు. అయితే గర్భిణి కుటుంబ సభ్యులు మాత్రం వైద్యుల నిర్లక్యంగా కారణంగానే ఆమె చనిపోయిందంటూ గొడవకు దిగారు.

దీంతో పోలీసులు రంగంలోకి దిగి బాధితురాలి బంధువుల ఫిర్యాదు మేరకు సదరు డాక్టర్‌ అర్చనపై కేసు నమోదు చేశారు. అంతేగాదు ఆమె పై తక్షణమై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేయడంతో లాల్సోట్ పోలీస్ స్టేషన్‌లో ఆ డాక్టర్‌ పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. దీంతో తీవ్ర ఆందోళనకు గురైన వైద్యురాలు అవమానం తట్టుకోలేక తన నివాసంలోనే ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

‍(చదవండి: మహేష్ బ్యాంకు హ్యాక్‌ కేసు.. షాకింగ్‌ విషయాలు వెల్లడి)

మరిన్ని వార్తలు