పుణేలో వైద్య దంపతుల ఆత్మహత్య 

2 Jul, 2021 11:29 IST|Sakshi

సాక్షి ముంబై: పుణేలో వైద్య దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. స్వల్ప వివాదమే ఈ ఆత్మహత్యలకు కారణమని తెలిసింది. ఈ సంఘటన గురువారం ఉదయం వెలుగులోకి వచ్చింది. నిఖిల్‌ శేండ్కర్‌ (27), ఆయన భార్య అంకిత శేండ్కర్‌ (26) దంపతులు పుణేలో వానవడీలోని ఆజాద్‌నగర్‌లో నివసించేవారు. 

కాగా, నిఖిల్‌ ఇంటికి తిరిగి వచ్చే సమయంలో భార్యతో ఫోన్‌లో వివాదం కొనసాగిందని తెలిసింది. దీంతో బుధవారం రాత్రి అంకిత ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. విధులు ముగించుకుని రాత్రి ఆలస్యంగా ఇంటికి వచ్చిన నిఖిల్‌ తన భార్య ఉరివేసుకుని మృతిచెందడం చూసి తట్టుకోలేకపోయాడు. దీంతో అతను కూడా అదే ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.  

మరిన్ని వార్తలు