యువతికి వైద్యుడి లైంగిక వేధింపులు 

8 Oct, 2022 08:19 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, బెంగళూరు: వైద్యం కోసం వచ్చిన యువతిని లైంగికంగా వేధించిన ఘటన బెంగళూరులో జరిగింది. ఇటీవల అవ్వతో కలిసి 19 ఏళ్ల యువతి కడుపునొప్పితో చికిత్స కోసం డాక్టర్‌ ఉబేదుల్లా వద్దకు వెళ్లింది. సెలైన్‌ పెట్టాలని వృద్ధురాలిని బయటకు పంపి యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. యువతి అక్కడి నుంచి వెళ్లడానికి యత్నించగా బెదిరించాడు.

ఆ తరువాత ఆ యువతి మళ్లీ జ్వరం బారిన పడింది. తిరిగి కుటుంబ సభ్యులు ఉబేదుల్లా వద్దకు వెళ్దామని చెప్పగా వద్దని వారించింది. విషయం ఆరా తీయగా అసలు విషయం వెల్లడించడంతో ఆ యువతి సోదరులు అరుంధతి నగరలో ఉన్న ఉబేదుల్లా క్లినిక్‌కు వెళ్లి అక్కడ ఫర్నిచర్‌ని ధ్వంసం చేశారు. వైద్యుడు పరారయ్యాడు. పోలీసులు వైద్యుడిపై కేసు నమోదు చేశారు. 

మరిన్ని వార్తలు